సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో (ఏవోబీ)లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్‌తో గిరిజన ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఓ వైపు పోలీసుల గాలింపు, మరోవైపు మావోయిస్టుల వారోత్సవాలతో ఏజెన్సీ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. ఎప్పుడు ఏం జరగుతుందోనన్న భయంతో గిరిజనులు భయాందోళనకు గురవుతున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య అనంతరం ఏజెన్సీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కిడారి హత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గిరిజనులను విచారిస్తున్నారు.
ప్రత్యక బృందం (సిట్) అధికారి ఫకీరప్ప నేతృత్వంలో స్థానికులను విచారిస్తూ.. ఏజెన్సీలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా కిడారి డ్రైవర్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు. డీజీపీ ఠాకుర్ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి.. దర్యాప్తుపై వివరాలు సేకరించనున్నారు. కిడారి హత్య అనంతరం మావోయిస్టులు ఎటు వైపుకు వెళ్లారు.. హత్యలో స్థానికుల ప్రేమేయం ఎమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హత్యలో ఇప్పటికే పలువురు మావోయిస్టులను అనుమానితులుగా గుర్తించిన పోలీసులు వారి జాడ కోసం అన్వేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment