నిఘా నీడన శేషాచలం | Andhra Pradesh-Orissa border | Sakshi
Sakshi News home page

నిఘా నీడన శేషాచలం

Published Fri, Nov 4 2016 1:19 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

నిఘా నీడన  శేషాచలం - Sakshi

నిఘా నీడన శేషాచలం

ఆంధ్రప్రదేశ్-ఒరిస్సా సరిహద్దు ప్రాంతం (ఏవోబీ)లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌తో జిల్లా ఉలిక్కిపడింది. ఇదే జిల్లాకు చెందిన కీలక నాయకుడు చలపతి అదృశ్యంపై ఇంతవరకూ ప్రకటన వెలువడకపోవడం చర్చనీయాంశమైంది. గతంలో మావోరుుస్టుల ఉనికి చాటుకున్న నేపథ్యంలో ఎన్‌కౌంటర్ తర్వాత పోలీసులు తాజాగా అప్రమత్తమయ్యారు. మావోరుుస్టులు బంద్‌కు పిలుపు నివ్వడంతో పోలీసులు శేషాచలాన్ని చక్రబంధం చేశారు. అడవిని అణువణువునా జల్లెడ పడుతున్నారు. గత చరిత్ర దృష్ట్యా వీరు తేలిగ్గా తీసుకోకుండా పూర్తి స్థారుులో గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో మావోరుుస్టులతో సంబంధాలు ఉన్న వారిపై నిఘా పెట్టారు. శేషాచలం అడవులు కేంద్రంగా మావోలు ఉద్యమాలు నిర్వహించిన వైనాలను పోలీసులు గుర్తుకుతెచ్చుకుంటున్నారు.

భాకరాపేట: ఆధ్యాత్మిక జిల్లాగా పేరొందిన ఈ ప్రాంతంలో మావోరుుస్టుల కార్యకలాపాలు 2004 వరకూ చురుగ్గానే ఉండేవి. 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయయుడిపై అలిపిరి సమీపంలోనే క్లైమోర్ మెన్‌‌స బాంబులు పెట్టి పేల్చారు. ఈ దాడికి పథక రచన శేషాచలం అడవులలోనే జరిగిందని పోలీసులు తేల్చారు. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డిపై నెల్లూరు జిల్లా వాకాడు వద్ద కూడా ఇదే తరహాలోనే బాంబు దాడి జరిగింది. అప్పటి పీపుల్స్‌వార్ కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా నుంచే పథక రచన చేశారని నిర్ణారణ అరుు్యంది.

ఇదీ జిల్లాలో ఎన్‌కౌంటర్ల నేపథ్యం

►జిల్లాలోని శ్రీ కాళహిస్తి నియోజక వర్గం అదరంలో 1995లో ఎన్‌కౌంటర్ సంస్క­ృతి ప్రారంభమైంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగులు కాళంగి దళం సభ్యులు మృతి చెందారు.

►అదే ఏడాదిలో ఇదే ప్రాంతంలో దళ కమాండర్ సురేష్ ఎన్‌కౌంటర్ అయ్యారు.

►1996లో  పెద్దమండ్యం సమీపంలో మంగలి క్రిష్ణప్ప, వెంకటస్వామి, విజయక్క ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు.

►1999లో కేవీ పల్లె మండలం నూతనకాల్వ సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముక్కోడు అలియాస్ బాలన్న మృతి చెందాడు

►2001లో కేవీ పల్లె మండలం పెండ్లిపెంట కొర్నాలగుట్ట వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చంద్రయ్య మృతి చెందగా 9 మంది దళ సభ్యులు తప్పించుకున్నారు.

 ►2003లో ఎర్వ్రారిపాళెం మండలం తలకోన రిజర్వు ఫారెస్టులో జరిగిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా మరో నలుగురు పరారయ్యారు.

►2004 జనవరి 24 నాటి అర్థరాత్రి పీలేరు సమీపంలో అలిపిరి ఘటనలో పాల్గొన్న ఎరస్రత్యం, శివానంద్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు.

బంద్ పిలుపుతో జిల్లాలో...
తాజాగా ఏవోబీ బంద్ పిలుపుతో పోలీసులు నిఘా పటిష్టం చేశారు. చిత్తూరు జిల్లా కేంద్రంగా గతంలో మావోరుుస్టుల రాష్ట్ర కమిటీ పని చేయడంతో పాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలో మావోరుుస్టు ఉద్యమాలు జరిగిన చరిత్ర ఉండడం, సీఎం సొంత జిల్లా  కావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. చిన్నగొట్టిగల్లు, ఎర్వ్రారిపాళెం, కేవీ పల్లె, గుర్రంకొండ, తంబళ్లపల్లె, ములకలచెరువు, బి.కొత్తకోట, పెద్దమండ్యం, ఏర్పేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, వరదయ్యపాళెం, సత్యవేడు, నగరి, పుత్తూరు, పుంగనూరు, సోమల, సదుం, మండలాల్లో ఎస్టీఎఫ్ బలగాలతో కూంబింగ్‌లు నిర్వహించడం, వాహన రాక పోకలను నిశితంగా తనిఖీలు నిర్వహించి పంపుతున్నారు.

►అటవీ సరిహద్దు, సానుభూతిపరులు ఉన్న గ్రామాల్లోనూ, పోలీసుల వద్ద ఉన్న సమాచారం మేరకు నిఘా పెట్టారు. జిల్లా అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రహదారులలోని కల్వర్టులను క్షణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఎస్టీఎఫ్ బలగాలతో అటవీ సరిహద్దుల్లో కూంబింగ్ చేపట్టారు. జిల్లాలోని తూర్పు, పశ్చిమ మండలాల్లో పోలీసులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ప్రభు త్వ కార్యాలయాల వద్ద పోలీసుల గురువారం తెల్లవారుజాము నుంచే కాపు కాశారు.

► చిన్నగొట్టిగల్లు, ఎర్వ్రారిపాళెం, కేవీ పల్లె అటవీ సరిహద్దు ప్రాంతమైన పీలేరు రూరల్ సర్కిల్ ఆధ్వర్యంలో ఎస్టీఎఫ్ బలగాలు గస్తీ తిరిగారుు. దీంతో వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లె మండలం పరిధిలో అక్కడి పోలీసులతో ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ శేషాచలం అటవీ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించి తనిఖీలు నిర్వహించారు.

►పీలేరు నియోజక వర్గంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి మరింత పట్టిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పీలేరు రూరల్, తంబళ్లపల్లె సర్కిల్ పరిధిలో ప్రత్యేకించి జన చైతన్య యాత్రలు చేపట్టేట్లుంటే పోలీసుల అనుమతి లేకుండా గ్రామాల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఏవోబీ ఎన్‌కౌంటర్‌పై ప్రజల్లో తీవ్ర స్థారుులో చర్చ జరుగుతుందని ఇంటెలిజెన్‌‌స వర్గాలు నివేదికలు ప్రభుత్వానికి అందడం వల్లే పోలీసు శాఖ ప్రత్యేకంగా చర్యలు చేపట్టిందన్నది సమాచారం.

అలిపిరి ఘటనతో ఆగిన వార్
అలిపిరి ఉదంతంలో రాష్ట్ర పీపుల్స్‌వార్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర మిలటరీ కమిషన్ సభ్యుడైన ఎర్ర సత్యం అలియాస్ బలిజె రామ్మోహన్‌రావు, అనంతపురం జిల్లా కమిటీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి అలియాస్ తెలంగాణ గంగన్న , అనంతపురం జిల్లా కమిటీ సభ్యుడు శంకర్ అలియయాస్ కురవ శివానంద్ పాల్గొన్నారని పోలీసులు తేల్చారు.

►2004 జనవరి 24న పీలేరుకు మూడు కిలోమీటర్లు దూరంలో వార్ నేతలు ఎరస్రత్యం, శివానంద్ ఎన్‌కౌంటర్ అయ్యారు. కడప జిల్లా సుండుపల్లె సమీపంలో తెలంగాణ గంగన్న ఎన్‌కౌంటర్ అయ్యారు. తర్వాత జిల్లాలో మావోరుుస్టుల కార్యకలాపాలు తగ్గారుు. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన చర్చల ఫలితంగా మావోల కదలికలు కనుమరుగయ్యారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement