మావోయిస్టుల కదలికలపై బంగారుగుడ్డి గ్రామస్తులను అడిగి తెలుసుకుంటున్న ఎస్‌ఐ సీహెచ్.గంగరాజు
పాచిపెంట: ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల నేపథ్యంలో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో మంగళవారం విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతి గిరిజన గూడ బూట్ల చప్పుళ్లతో మార్మోగింది. ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా వటాఫ్ ప్రాంతంలోని ముకుడుపల్లి, విశా ఖ ఏజెన్సీ పెదబయలు మండలంలోని లండులు అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల కోసం ఇక్కడి అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
మండ లంలోని ఏవోబీ సరిహద్దు ప్రాంతాలైన బంగారుగు డ్డి, అడారుపాడు, కాట్రాగుడ్డి కుంతాం తదితర ప్రాంతాల్లో డేగ కన్నుతో జల్లెడ పడుతున్నాయి. అ టు వైపు నుంచి ఒడిశా పోలీసు బలగాలు కూడా కూ బింగ్‌లో నిమగ్నయయ్యాయి, మండల కేంద్రాలు ప్రధాన రోడ్డలో వాహనాల తనిఖీని విస్తృతం చేసి నట్లు ఎస్‌ఐ సీహెచ్. గంగరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment