♦ దీనిపై విచారణకు ఆదేశించండి
♦ హైకోర్టులో టీయూసీసీ అధ్యక్షుడి పిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లో (ఏవోబీ) గత నెలలో జరిగిన ఎన్కౌంటర్‌లో గ్రేహౌండ్స్ పోలీసులు తొమ్మిది మంది అమాయక ఆదివాసీలను కాల్చి చంపారని, దీనిపై విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఎన్కౌంటర్‌లో బలైపోయి న ఈ 9 మంది ఆదివాసీల కుటుంబాలకూ ఒక్కో కుటుంబానికి రూ.40 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ట్రేడ్ యూ నియన్ కో ఆర్డినేషన్ సెంటర్ (టీయూసీసీ) అధ్యక్షుడు పి.నారాయణస్వామి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గ్రేహౌండ్స్ డీఐజీ, విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్‌పీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
గత నెల 24న బలిమెల రిజర్వాయర్ వద్ద మావోయిస్టుల ఎన్కౌంటర్ సందర్భంగా లచ్చా మోదిలి, కావేరి మోదిలి, ముబిలి, మల్కన్ పంగి, అమ్లా, షిండే, శ్యామల, జయ, కోమలిలను పోలీసులు కాల్చి చంపారన్నారు. వాస్తవానికి మావోయిస్టుల కు, వీరికి ఇటువంటి సంబంధం లేదని పిటిషనర్ వివరించారు. మావోయిస్టుల ఎన్కౌంటర్‌కు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న వీరిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కడతేర్చారని తెలిపారు. ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై నివేదిక సమర్పించేందుకు న్యాయవాదుల బృందాన్ని నియమించాలని నారాయణస్వామి కోర్టును కోరారు.
ఆదివాసీలను అన్యాయంగా చంపేశారు
Published Sun, Nov 20 2016 1:42 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement