సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్ ఏరియాలో ఇటీవల 30 మంది మావోయిస్టులపై పోలీసుల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం 5 రాష్ట్రాల్లో బంద్ జరగనుంది. బంద్‌ను విజయవంతం చేసేందుకు మావోలు ఇప్పటికే మన్యంలో బ్యానర్లు, కరపత్రాలతో ప్రచారం చేస్తుండగా, విఫలం చేయడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దయ, గణేష్ వంటి స్టేట్ కమిటీ సభ్యులతో పాటు డివిజన్ కమిటీ, ఏరియా కమిటీ సభ్యులను, అమాయక గిరిజనులను ప్రభుత్వ ప్రోద్బలంలో పోలీసులు పట్టుకుని కాల్చి చంపేసి ఎదురుకాల్పుల్లో చనిపోయారంటున్నారని ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ ఆరోపించింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్రలో బంద్ చేపట్టనున్నట్లు ప్రకటించింది.
సురక్షిత ప్రాంతాలకు ప్రజా ప్రతినిధులు
బంద్ నేపథ్యంలో ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశాలున్నాయనే సంకేతాలు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంద్ ప్రభావం ఉండే ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులను, మావోల హిట్ లిస్టులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రభుత్వ కార్యాలయాలు, సెల్ టవర్లకు భద్రత కల్పించారు. మన్యంలో అనుమానితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.
నేడు 5 రాష్ట్రాల్లో మావోల బంద్
Published Thu, Nov 3 2016 3:26 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM
Advertisement