ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయనగరం : మరో సారి ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో తుపాకుల మోత మోగింది. జోడుంబా, సీలేరు ప్రాంతంలో రెండు రాష్ట్రాల పోలీసులు, మావోయిస్టులు పరస్పరం బుల్లెట్ల వర్షం కురిపించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జోడాంబా, సీలేరు సమీపంలో మావోయిస్టులు పెద్దఎత్తున సమావేశం ఏర్పాటు చేశారనే సమాచారం అందుకున్న ఇరు రాష్ట్రాల పోలీసులు సంయుక్తంగా విస్తృత కూంబింగ్ నిర్వహించారు.
కటాప్ ప్రాంతంలో ఎదురుపడ్డ రెండు వర్గాలు పరస్పర ఎదురు కాల్పులకు దిగాయి. కొన్ని గంటలపాటు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే అక్కడి నుంచి మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఈ కాల్పుల్లో సుమారు 50మందికిపైగా మావోయస్టులు పాల్గొన్నట్లు సమాచారం. ఇందులో కీలక నేత ఆర్కే కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ 54 మావోయిస్టుల కిట్ బ్యాగులను స్వాధీన పరచుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. తప్పించుకున్న మావోయిస్టుల కోసం ముమ్మర కూంబింగ్ కొనసాగుతోంది. ఇందుకోసం అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment