సెమీస్‌లో సిరిల్ వర్మ | Siril Varma reaches semis of World Junior Championships | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సిరిల్ వర్మ

Published Sun, Nov 15 2015 4:44 AM | Last Updated on Fri, Aug 17 2018 8:01 PM

సెమీస్‌లో సిరిల్ వర్మ - Sakshi

సెమీస్‌లో సిరిల్ వర్మ

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం అల్లూరి శ్రీసాయి సిరిల్ వర్మ విజయపరంపర కొనసాగుతోంది. హైదరాబాద్‌కు చెందిన 15 ఏళ్ల ఈ కుర్రాడు బాలుర సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. పెరూలోని లిమా నగరంలో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో సిరిల్ వర్మ మరోసారి సీడెడ్ క్రీడాకారుడిని బోల్తా కొట్టించి ముందంజ వేశాడు.

భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన బాలుర సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ 21-15, 21-14తో పదో సీడ్ సతీస్‌థరన్ (మలేసియా)పై గెలిచాడు. అంతకుముందు సిరిల్ మూడో రౌండ్‌లో తొమ్మిదో సీడ్ కాంతాపోన్ వాంగ్‌చెరన్ (థాయ్‌లాండ్)పై, ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ ఆందెర్స్ అంటోన్‌సెన్ (డెన్మార్క్)పై సంచలన విజయాలు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement