మలేరియా కేసులు తగ్గుముఖం పట్టడం ఊరటనిస్తోంది. గత మూడేళ్ల నుంచి దోమల నివారణతో పాటు మహమ్మారి తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖల శ్రమకు ఫలితం లభించింది. మరణాల నివారణతోపాటు మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది.
సాక్షి, పాడేరు : మన్యంలో మలేరియా పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తోంది. ఒకప్పుడు మలేరియా మహమ్మారితో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దోమకాటుకు గురై మలేరియా జ్వరాల బారిన పడటంతో పరిస్థితి ప్రాణాల మీదకు వచ్చేది. పారిశుధ్య కార్యక్రమాలు గ్రామాల్లో అంతంత మాత్రంగానే ఉండేవి. మన్యంలో 2012 నుంచి 2018 వరకు మలేరియా విజృంభించడంతో మరణాలు చోటు చేసుకునేవి. ఇప్పడు ఆ పరిస్థితి లేదు.
సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా..
ఏర్పడిన తరువాత మన్యంలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. సీజనల్ వ్యాధుల నివారణే లక్ష్యంగా సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అనేక వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపట్టారు. గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 50 కుటుంబాలకు గ్రామ వలంటీర్ల సేవలను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. సీజనల్ వ్యాధుల నివారణ లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన అనేక చర్యలు చేపట్టింది. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను సచివాలయ వ్యవస్థ విస్తృతం చేసింది. మరోవైపు దోమల నివారణకు ప్రభుత్వం ] మలేరియా, వైద్య ఆరోగ్యశాఖ బృందాలు నిరంతరం పనిచేశాయి.
దోమతెరలతో..
తెరలను ప్రభుత్వం పంపిణీ చేయడం మరింత మేలు చేసింది. గిరిజనులకు దోమ కాట్ల బెడద లేకుండా 5,02,950 దోమతెరలను అందజేసింది. వీటి వినియోగంపై వైద్య బృందాలు, సచివాలయ ఉద్యోగులు గిరిజనులకు అవగాహన కల్పించారు. ఏప్రిల్ నెల నుంచి అక్టోబర్ నెల వరకు ఎపిడమిక్ సీజన్‌గా ప్రభుత్వం గుర్తించి వైద్య ఆరోగ్య కార్యక్రమాలను చేపడుతోంది.
మలేరియా, వైద్యారోగ్యశాఖలు..
మూడేళ్ల నుంచి దోమల నివారణతో పాటు మలేరియా తీవ్రతను అరికట్టడంలో మలేరియా, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతో శ్రమించాయి. మరణాలు కూడా లేకపోవడంతో మలేరియాను కట్టడి చేయడంలో ప్రభుత్వ వ్యూహం ఫలించింది. పాడేరు ఐటీడీఏ పీవో, ఇతర శాఖల అధికారులు కూడా దోమల నివారణ మందు పిచికారీ పనులను నిరంతరం పర్యవేక్షించేవారు. ఏటా రెండు దఫాలుగా దోమల నివారణ మందు పిచికారీ పనులు జరిగాయి. ప్రతి గిరిజన కుటుంబం ఇంటా, బయట దోమల మందు పిచికారీని తప్పనిసరిగా జరుపుకోవాలనే నిబంధనలు కూడా సచివాలయ ఉద్యోగులు అమలు చేసేవారు.
గ్రామ వలంటీర్ల పర్యవేక్షణలో..
సచివాలయ వ్యవస్థ ఏర్పడడంతో పాటు గ్రామ వలంటీర్లంతా తమ నిర్దేశిత గిరిజన కుటుంబాల నివాసాలకు దగ్గరుండి దోమల నివారణ మందు పిచికారీ చేయించేవారు. ఇంటింటా ఫీవర్ సర్వే కూడా విజయవంతంగా జరిగింది
Comments
Please login to add a commentAdd a comment