
'రూ. 8 కోట్లతో అల్లూరి మ్యూజియం ఏర్పాటు'
హైదరాబాద్: భారత స్వాతంత్ర్య పోరాటంలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పాత్ర మరువలేనిదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్లోని ట్యాంక్ బండపై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి చంద్రబాబు ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... బ్రిటీష్ వారిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి అల్లూరి అని గుర్తు చేశారు. ఆయన పోరాటం భావితరాలకు ఎంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. రూ. 8 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్లమెంట్లో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.