
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు సీఎం జగన్. స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.
ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అలుపెరుగని పోరాటం చేసిన వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు. ఆయన త్యాగాన్ని ఎల్లప్పుడూ స్మరించుకునేలా మన ప్రభుత్వంలో ఆయన పేరు మీద జిల్లాను ఏర్పాటు చేశాము.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2023
నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి.
చదవండి: ‘మార్గదర్శి’ అక్రమాలు, నిజానిజాలు.. రామోజీ గురించి ఏం చెప్పారంటే?