రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజాన్ని గడగడలాడించిన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు పోరాటం దేశ చరిత్రలో నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
హైదరాబాద్ : రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజాన్ని గడగడలాడించిన అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు పోరాటం దేశ చరిత్రలో నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ పార్లమెంట్ ఆవరణలో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అల్లూరి సమాధి ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మరోవైపు అల్లూరి జయంతి, వర్థంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.