విశాఖపట్నం: స్వాతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంటులో స్థాపించాలని కోరుతూ 'స్వామి వివేకానంద' అనే స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఎన్టీఆర్, అల్లూరి విగ్రహాలకు ఒకేసారి అనుమతులు వచ్చినా కేవలం ఎన్టీఆర్ విగ్రహమే స్థాపించి అల్లూరి విగ్రహ స్థాపన విషయాన్ని మరిచిపోవడం శోచనీయమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకొని పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని స్థాపించాలని కోరారు. శుక్రవారం విశాఖపట్నంలోని జగదాంబ జంక్షన్ లో వారు మీడియాతో మాట్లాడారు.