పార్లమెంట్‌లో అల్లూరి విగ్రహం
► విజయసాయి రెడ్డి లేఖకు స్పందించిన లోకసభ కార్యదర్శి
న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర్య సమర యోధుడు, తెలుగు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటుపై పార్లమెంట్ హౌస్ కమిటీ స్పందించింది. వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేయాలని సుధీర్ఘ కాలంగా కోరుతున్నారు.
దీనిపై విజయసాయి రెడ్డి పలుసార్లు పార్లమెంట్ కమిటీకి లేఖలు రాశారు. దీనిపై లోక్‌సభ కార్యదర్శి మునీష్ కుమార్ లేఖలపై స్పందించారు. త్వరలో పార్లమెంట్‌లో విగ్రహాల ఏర్పాటుపై జాయింట్ కమిటీ సమావేశం జరగనున్నట్లు మునీస్ కుమార్ విజయ సాయి రెడ్డికి తెలియచేశారు.