ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు లోక్‌సభ డిప్యూటీ సెక్రటరీ జవాబు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: మన్యం వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్ల మెంటు ప్రాంగణంలో ప్రతిష్టించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యుడు వేణుంబాక విజయసాయి రెడ్డి లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజ న్‌కు రాసిన లేఖపై లోక్‌సభ డిప్యూటీ సెక్రటరీ మునీష్‌కుమార్ స్పందించారు.
ఎంపీ రాసిన లేఖను లోక్‌సభ స్పీకర్ ఆదేశం మేరకు పార్లమెంట్ ప్రాంగణం లో స్వాతం త్య్ర సమరయోధులు, పార్లమెంటేరియన్ల విగ్రహాల ఏర్పాటు ను ఖరారు చేయడానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపినట్టు తెలిపారు. జేపీసీ తదుపరి సమావేశంలో అల్లూరి విగ్రహం ఏర్పాటు అంశంపై చర్చిస్తుం దని ఎంపీకి తెలియజేశారు.
అల్లూరి విగ్రహంపై జేపీసీ త్వరలో చర్చిస్తుంది
Published Fri, May 12 2017 1:40 AM | Last Updated on Fri, Aug 17 2018 8:01 PM
Advertisement
Advertisement