పారామెడికల్ విద్యార్థుల పరీక్షలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 21వ తేదీనుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఇన్‌స్టిట్యూషన్లలో చదువుతున్న విద్యార్థులకు
ఏపీలో 21వ తేదీ నుంచి థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పారామెడికల్ విద్యార్థుల పరీక్షలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈనెల 21వ తేదీనుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఇన్‌స్టిట్యూషన్లలో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్టు పారామెడికల్ బోర్డు ప్రకటించింది. సుమారు 25 రకాల పారామెడికల్ కోర్సులకు థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు 21 నుంచి జరగనున్నాయి. డిప్లొమా కోర్సులకు 21 నుంచి 23వ తేదీ వరకూ థియరీ పరీక్షలు, 28 నుంచి 30 వరకూ ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయి. 12వ తేదీలోగా విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 18న హాల్‌టికెట్లు జారీచేస్తారు.
రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలతో పాటు పశ్చిమ గోదావరిలోని అల్లూరి సీతారామరాజు మెడికల్ కాలేజీ, విజయనగరంలోని మహరాజా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ప్రైవేటు కళాశాలలను కూడా పరీక్షా కేంద్రాలుగా నిర్ణయించారు. మొత్తం 13 పరీక్షా కేంద్రాల్లో థియరీ, ప్రాక్టికల్ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.