
అల్లూరిపై సినిమా తీసే యోచన
- ప్రవాస భారతీయుడు పరిగ ఆదిత్య
- లండన్‌లో దర్శకత్వంలో శిక్షణ
కొయ్యూరు: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటంపై సినిమా తీయాలని యోచిస్తున్నానని ప్రవాస భారతీయుడు పరిగ ఆదిత్య తెలిపారు. ఇందులో భాగంగా ఆయన చరిత్రపై అధ్యయనం చేస్తున్న ట్లు చెప్పారు. గతంలో తీసిన అల్లూరి సీతారామరాజు సినిమాను చూశానని చెప్పారు. మండలంలోని మంప, రా జేంద్రపాలెం, కేడిపేటలో ఉన్న అల్లూరి స్మారక మందిరాలను, స్తూపాలను, పార్కును, అల్లూరి స్నానం చేసిన చెరువును, అల్లూరిని మేజర్ గూడాల్ చంపిన ప్రాంతాన్ని, అల్లూ రి సమాధులను సందర్శించారు. పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆది త్య విలేకరులతో మాట్లాడారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైన అల్లూరి సంచరించిన ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ఆయన జీవిత చరిత్రపై సినిమా తీయాలన్న కోరిక ఉందని, ఇందులో భాగంగా ఆయన చరిత్ర తెలుసుకుంటున్నామని తెలిపారు. ఆంద్రప్రదేశ్‌కు చెందిన ఆదిత్య కుటుంబం కాలిఫోర్నియాలో 30ఏళ్ల నుంచి ఉంటోంది. ఆయన లండన్‌లో సినిమా డెరైక్షన్‌పై శిక్షణ కూడా తీసుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణారావుకు వీరు బంధువులు.
స్మారక మందిరాలను బాగు చేస్తే మేలు
ఆదిత్య తండ్రి సుధాకర్‌రావు మాట్లాడుతూ ఆల్లూరి స్మారక మందిరాలను బాగు చేస్తే ఎందరో వచ్చి వాటిని చూసేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. స్మారక మందిరం ఆవరణలో పిచ్చిమొక్కలు పెరగడం, అల్లూరి జీవిత విశేషాలు లేకపోవడం బాధకలిగిస్తోందన్నారు.