
విలేరకులతో మాట్లాడుతున్న రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
రాజవొమ్మంగి: రాష్ట్రంలో అన్ని వర్గాలకు సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన 14 మందిని ఎమ్మెల్సీకి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సిఫార్సు చేయడం హర్షణీయమన్నారు. మండల కేంద్రంలో ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించారు. విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్‌కు వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక రామోజీరావు, చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఈనాడులో తప్పుడు రాతలు రాస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. ప్రజలు నేడు ఈనాడు పేపరును నమ్మే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా టీడీపీకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ శింగిరెడ్డి రామకృష్ణ, ఎంపీపీ గోము వెంకట లక్ష్మి, వైస్ ఎంపీపీ చంద్రరాణి, పార్టీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేష్‌రాజ్, అడ్డతీగల జెడ్పీటీసీ సభ్యుడు వీర్రాజు, సర్పంచ్ శివ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment