ప్రకృతి ఎప్పటికప్పుడూ తన వైవిధ్యంతో మనుషులను మంత్రముగ్దులయ్యేలా చేస్తూనే ఉంటుంది. కొన్నింటిని చూస్తే ప్రకృతిలో ఇంగ గొప్ప శక్తి ఉందా అని ఆశ్చర్యపోతుంటాం. అలాంటి ఓ విచిత్రమైన ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. వేసవి వచ్చిందంటే ఎందురయ్యే నీటి సమస్యకు ఆ అద్భుతం ఓ గొప్ప మార్గాన్ని అందించే ఆశాకిరణంలా కనిపిస్తోంది. ఇంతకీ ఏంటా అద్భుతం అంటే..
ఈ ఘటన మన ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి జిల్లాలోని రంపచోడవరం -కింటుకూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది . ఏం జరిగిందంటే..భూమి మూడోంతుల నీరు ఉంటుందని విన్నాం. కానీ కొన్ని చోట్ల భూమ్మీద నీరు కనిపించకపోయినా..తవ్వగానే ఉబికి రావడం జరగుతుంది. మరొకొన్ని చోట్ల కొండల్లోంచి పుట్టుకురావడం వంటివి జరుగుతాయి. కానీ ఇక్కడ మాత్రం అత్యంత విభిన్నంగా చెట్టులోంచి నీరు వస్తోంది. అంది కూడా పంపు నుంచి లీకైనట్లుగా ధారాపాతంగా వస్తోంది.
ఈ చెట్టుకి పూలు, కాయల తోపాటు నీళ్లు కూడా వస్తాయని అక్కడ స్థానికులు చెబుతున్నారు. ఆ చెట్టు పేరు నల్ల మద్ది చెల్లు. దీన్నుంచి నిరంతరాయంగా పంపు మాదిరిగా నీళ్లు ఫోర్స్‌గా వస్తాయి. అక్కడే ఇలాంటి చెట్లు వేలాదిగా ఉన్నాయి. ఈ చెట్టుకి నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుందట. ఆ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు గుర్తించి అందుకు సంబంధించిన వీడియోని తీసి నెట్టింట షేర్ చేయండతో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వింతైన దృశ్యాన్ని చూసేయండి.
అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జల ధార వృక్షం
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2024
పాపికొండల నేషనల్ కింటుకూరు అటవీ ప్రాంతంలోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కనివిప్పు చేసిన నల్లమద్ది చెట్టు.
నల్లమద్ది చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి. pic.twitter.com/5C7qmYB6an
Comments
Please login to add a commentAdd a comment