
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
నటి,హీరో అక్కినేని నాగచైతన్య రెండో భ�...
మీ కడుపు చల్లగుండ.. ఎవరికైనా ఏదైనా సాయ...
ప్రతీ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ వచ్చిం...
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వ�...
అనకాపల్లి, సాక్షి: పదేళ్ల కిందట తెలుగ�...
ఉమ్మడి అనంతపురం, సాక్షి: ఫ్యాక్షన్ ర�...
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష�...
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, వ�...
కృష్ణా, సాక్షి: ఓటేసి గెలిపించిన ప్రజ�...
హైదరాబాద్, సాక్షి: హెచ్‌సీయూ భూముల వ�...
వాషింగ్టన్: ప్రతీకార సుంకాల విధింప...
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పర�...
నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, �...
ప్రముఖ బుల్లి తెర నటుడు రామ్ కపూర్ 55 క...
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాజకీయ ఆ...
Published Mon, Jul 4 2022 8:33 AM | Last Updated on Thu, Jul 7 2022 7:04 AM
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగిసింది. బహిరంగ సభలో ప్రసంగం అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకోనున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రికి సీఎం జగన్ వీడ్కోలు పలికారు. అదే సమయంలో ప్రధానికి సీఎం విజ్ఞాపన పత్రం అందించారు.
స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను స్మరిస్తూ ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను సాకారం చేయాలన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు.
వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా.. రంప ఆందోళన ప్రారంభించి నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని ప్రధాని మోదీ అన్నారు. అల్లూరి సీతారామరాజు ఆదివాసుల శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. అల్లూరి తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారు. మనదే రాజ్యం నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి చిన్న వయస్సులోనే ఆంగ్లేయులపై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గొప్ప ఉద్యమకారుడన్నారు. దేశాభివృద్ధికి యువత ముందుకు రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని మోదీ.. ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి అని.. ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషంగా ఉందన్నారు. అజాదీకా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న వేళ.. అల్లూరి 125వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. మన్యం వీరుడు, తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని ప్రధాని కొనియాడారు. యావత్ దేశానికి అల్లూరి సీతారామరాజు స్ఫూర్తి అన్నారు.
భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
ఒక మనిషిని.. ఇంకొక మనిషి.. ఒక జాతిని మరొక జాతి.. ఒక దేశాన్ని మరొక దేశం దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని స్వాతంత్ర్య సమరయోధులు ఆకాంక్షించారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షలాది మంది ప్రాణాలు అర్పించారన్నారు. అల్లూరి ఒక మహా అగ్ని కణం.. ఆయన తెలుగు గడ్డపై పుట్టడం గర్వకారణమని సీఎం జగన్ అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో పర్యటిస్తున్నారు. భీమవరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాని మోదీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించారు. ఆయనకు శాలువ కప్పి.. విల్లంబు, బాణం బహుకరించారు. అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులను ప్రధాని సత్కరించారు. సభా వేదిక నుంచే వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించనున్నారు.
ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ భీమవరం చేరుకున్నారు. ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు మోదీ చేరుకుంటారు.
గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని మోదీ బయలుదేరారు. ప్రధానితో పాటు గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం బయలుదేరారు.
గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఒకే హెలికాప్టర్లో ప్రధాని, గవర్నర్, సీఎం భీమవరం వెళ్లనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. వారిరువురు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకనున్నారు.
ప్రధాని మోదీ బేగంపేట నుంచి గన్నవరం బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళతారు. 11 గంటలకు ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ బయలుదేరారు. హైదరాబాద్ రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుని.. అక్కడ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
అల్లూరి కుటుంబ సభ్యులు, వారసులతో ప్రధాని, సీఎం ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని ప్రధాని సత్కరిస్తారు. తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం సభా వేదిక నుంచే వర్చువల్ విధానం ద్వారా భీమవరం పట్టణంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళి అర్పిస్తారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాని మోదీని సత్కరిస్తారు.
ప్రధాని మోదీ పర్యటనకు భీమవరం ముస్తాబైంది. అల్లూరి జయంతి వేడుకలకు ప్రధానితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, సినీ నటుడు చిరంజీవితో పాటు ప్రముఖులు హాజరుకానున్నారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చే ప్రధాని మోదీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలుకుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదివారం పరిశీలించారు. విమానాశ్రయాన్ని ఎస్పీజీ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
గన్నవరం విమానాశ్రయం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వెళతారు. 11 గంటలకు ఏఎస్ఆర్ పార్కులో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం భీమవరం సమీపంలోని పెదఅమిరంలో బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు. బహిరంగ సభ అనంతరం 12.20 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరతారు. 1.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 3.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం వెల్లడించింది.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఏపీ పర్యటనకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని సాంస్కతిక, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగే అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ సోమవారం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.