మరో వివాదంలో ఆర్‌ఆర్‌ఆర్‌.. ఏం జరిగినా రాజమౌళిదే బాధ్యత | Family Members Object to Alluri Sitaramaraju Role in RRR Movie | Sakshi
Sakshi News home page

RRR Movie: మరో వివాదంలో ఆర్‌ఆర్‌ఆర్‌.. ఏం జరిగినా రాజమౌళిదే బాధ్యత

Published Sun, Mar 6 2022 4:19 PM | Last Updated on Sun, Mar 6 2022 4:23 PM

Family Members Object to Alluri Sitaramaraju Role in RRR Movie - Sakshi

Family Members Object to Alluri Sitaramaraju Role in RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను వక్రీకరించారని ఆయన మనవడు లక్ష్మీపతి రాజు అన్నారు. సినిమాలో ఏది చూపిస్తే ప్రేక్షకులు కూడా అదే నిజమనుకునే ప్రమాదం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు తన జీవితంలో ఎక్కడా డ్యాన్స్‌ చేయలేదని, బ్రిటీష్‌ సైన్యంలో పనిచేయలేదని ఆయన అంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత అల్లూరి సీతారామరాజు అభిమానులు నొచ్చుకొని జరగరాని సంఘటనలు జరిగితే వాటికి దర్శకుడు రాజమౌళి బాధ్యత వహించాలని ఆయన మనవడు లక్ష్మీపతి రాజు మీడియా ముందుకు వచ్చాడు.

ఇదిలా ఉండగా, ఈ చిత్రం వరల్డ్​ వైడ్​గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్​ చరణ్, ​కొమురం భీమ్​గా జూనియర్ ఎన్టీఆర్​, సీతగా అలియా భట్​ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

చదవండి: (అమెరికాలో తారక్‌ అభిమాని అరాచకం.. అన్ని టికెట్స్‌ కొనేశాడు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement