Lakshmipathi
-
బాబాయి చనిపోతే నాన్న తాగి వచ్చాడు: కమెడియన్ కూతురు
ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన కమెడియన్లలో లక్ష్మీపతి ఒకరు. బాబీ, అల్లరి, మురారి, నీ స్నేహం, తొట్టిగ్యాంగ్, పెదబాబు, కితకితలు.. ఇలా దాదాపు 40 సినిమాల్లో నటించారాయన. మరీ ముఖ్యంగా ఆయన సునీల్‌తో కలిసి చేసిన కామెడీ సీన్స్ చూస్తే ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకుంటారు. లక్ష్మీపతి అన్న శోభన్ కూడా ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా రాణించారు. మహేశ్‌బాబు 'బాబీ', ప్రభాస్ 'వర్షం' సినిమాలకు ఈయనే దర్శకత్వం వహించారు. ఈ అన్నదమ్ములిద్దరూ కేవలం నెల రోజుల వ్యవధిలోనే కన్నుమూయడం అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా ఈ అన్నదమ్ముల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది లక్ష్మీపతి కూతురు, ఆర్జే శ్వేతా లక్ష్మీపతి. 'సినిమాలను తీసే క్రమంలో ఆస్తులు పోయాయి. రెండు థియేటర్లు అమ్మేశారు. కొన్నాళ్లు బాబాయి కనిపించలేదు. ఆ తర్వాత ఒక లెటర్ వచ్చింది. అందులో బాబాయి ఒక చోట క్షేమంగా ఉన్నానని రాసి డబ్బులు కూడా పంపించాడు. నా పుట్టినరోజుకు ముందు గిఫ్ట్ పంపించాడు. ఆయన డైరెక్టర్‌గా పనిచేసిన తొలి చిత్రం బాబీ ఫ్లాప్ కావడంతో ఫ్యామిలీపై దెబ్బపడింది. ఆర్థికంగా కుటుంబం అంతా కష్టాలు పడింది. అందుకని నెక్స్ట్ మూవీ వర్షం ఎంతో కసితో తీశాడు. అది సక్సెస్ అయింది కానీ తర్వాత తీసిన చంటి ఫెయిల్యూర్‌గా నిలవడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. బాబాయి చనిపోయినప్పుడు నేను వైజాగ్‌లో ఉన్నాను. అప్పుడు నా ఫోన్ పని చేయలేదు. రాత్రి 9 గంటలకు ఆఫీస్ ఫ్రెండ్స్ నా ఫ్లాట్కొచ్చి డోర్ కొట్టారు. అప్పుడే ఏదో నా మనసు కీడు శంకించింది, బాబాయ్‌కు బాలేదని చెప్పారు. నేను బస్సెక్కి ఇంటికి వెళ్తుంటే ఓ వార్తాపత్రికలో జనవరి 5న ఆయన చనిపోయారని చదివాను. ఆయనకు పొగ తాగడం తప్ప ఎటువంటి చెడ్డ అలవాటు లేదు. ఇంటికెళ్లేసరికి అందరూ ఏడుస్తున్నారు, కానీ నేను ఏడవలేదు. అందరూ నిద్రపోయాక ఏడ్చాను. బాబాయి లేరన్న బాధ తట్టుకోలేక నాన్న తాగి వచ్చాడు. ఆ కోపంతో నాన్నతో మాట్లాడలేదు. బాబాయి అంత్యక్రియలైపోయాక నేను వైజాగ్ వెళ్తుంటే నాన్న నన్ను పట్టుకుని ఏడ్చాడు. అయినా మాట్లాడకుండా వెళ్లిపోయాను. బాబాయి చనిపోయిన నెల రోజులకే ఫిబ్రవరి 5న నాన్న చనిపోయాడు. అప్పుడు కూడా నేను వైజాగ్‌లో ఉన్నాను. ఆరోజు పొద్దున నాన్న ఫోన్ చేసి అమ్మవాళ్లు ఇంకా ఇంటికి రాలేదేంటని అడిగారు. గంటలోపు వచ్చేస్తారులే అని చెప్పాను. తీరా మధ్యాహ్నం అయ్యేసరికి అమ్మ ఫోన్ చేసి నాన్నకు బాలేదని రమ్మన్నారు. వరుసగా ఫోన్లు రావడం మొదలైంది. విషయం సీరియస్ అని అర్థమైంది. వెంటనే హైదరాబాద్ వచ్చి నాన్నను కడసారి చూశాను. బాబాయి మరణంతో ఆయన బాగా డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. అదే ఆయన్ను కుంగదీసింది' అని చెప్పింది శ్వేత. చదవండి: బుల్లితెర నటి సూసైడ్, పోస్ట్‌మార్టమ్‌లో ఏముందంటే? అజిత్ -త్రిష కాంబినేషన్లో మూవీ -
యాప్స్‌తోనే లక్ష్మీపతి నెట్వర్క్
సాక్షి, హైదరాబాద్: పోలీసు పుత్రుడై ఉండి.. గంజాయి, హష్ ఆయిల్ దందాతో ‘హష్ నగేశ్’ నెట్‌వర్క్‌లో కీలకంగా మారిన వీరవల్లి లక్ష్మీపతి దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. 2020లో మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులకు చిక్కిన లక్ష్మీపతి.. తర్వాత ‘వర్కింగ్ స్టైల్’ పూర్తిగా మార్చేశాడని.. పకడ్బందీగా హష్ ఆయిల్ దందా నడిపాడని ‘హెచ్–న్యూ’ అధికారులు చెప్తున్నారు. పేరు కూడా తెలియకుండా..: లక్ష్మీపతి మొదట్లో వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని గంజాయి సరఫరా చేసేవాడు. మల్కాజ్గిరి పోలీసులకు ఇతడి అనుచరులు చిక్కినప్పుడు వారి వాట్సాప్ డేటా ఆధారంగానే లక్ష్మీపతిని అరెస్టు చేశారు. దాంతో లక్ష్మీపతి తన పంథా మార్చేశాడు. మకాంను కూడా మణికొండ నుంచి హఫీజ్ పేటకు షిఫ్ట్ చేశాడు. ఈసారి ఫేస్బుక్ మెసెంజర్‌తోపాటు స్నాప్ చాట్, టెలిగ్రాం యాప్స్ వాడటం మొదలెట్టాడు. వాటిలోనూ వివరాలన్నీ హైడ్ చేసి.. కేవలం ‘ఎల్పీ’ అనే పేరు మాత్రమే కనిపించేలా చేసేవాడు. ఎక్కడా ఫొటోలేవీ బయటపడనీయలేదు. కస్టమర్లతోనే బుక్ చేయించి... హైదరాబాద్‌లో అనేక యాప్స్ వివిధ వస్తువుల పికప్–డెలివరీ సేవలు అందిస్తుండటంతో.. లక్ష్మీపతి వాటిని తన దందా కోసం వాడుకున్నాడు. సోషల్ మీడి యా ద్వారా కస్టమర్ల నుంచి ఆర్డర్ తీసుకుని, డబ్బును ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడు. ‘సరుకు’ తీసుకునే వారితోనే పికప్–డెలివరీ సర్వీసు బుక్ చేయించేవాడు. హఫీజ్‌పేటలోని ఓ ల్యాండ్‌మార్క్‌ను పికప్‌గా.. వారుండే లొకేషన్‌ను డెలివరీ ప్రాంతంగా బుక్ చేయించి.. సరుకును పంపిస్తాడు. ఇంత జా గ్రత్తగా ఉండటంతో అతడిని గుర్తించి, పట్టుకోవడానికి హెచ్–న్యూ అధికారులు శ్రమించాల్సి వచ్చింది. (చదవండి: లగేజ్ బ్యాగేజ్‌లలో గంజాయి ప్యాకెట్లు..నలుగురు అరెస్టు) -
హష్.. కేరాఫ్ నగేశ్.. సేద్యం, తయారీ, సరఫరా
సాక్షి, హైదరాబాద్: ఈ నగేశ్ మామూలోడు కాదు. హష్ ఆయిల్ నెట్‌వర్క్‌లో ఏపీలోని లోగిలి గ్రామానికి చెందిన కె.నాగేశ్వర్రావు పాత్ర కీలకమని పోలీసులు గుర్తించారు. తెలంగాణలో నమోదైన తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడు ప్రేమ్ ఉపాధ్యాయకు హష్ ఆయిల్ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతి ఇతడి దళారుల్లో ఒకరని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్–న్యూ) అధికారులు నిర్ధారించారు. వీరి నుంచి హష్ ఆయిల్ ఖరీదు చేస్తున్న మరో ఇద్దరు వినియోగదారులనూ కటకటాల్లోకి పంపామని డీసీపీ చక్రవర్తి గుమ్మి బుధవారం ఇక్కడ మీడియాకు వెల్లడించారు. కుటుంబం మొత్తం అదే దందాలో... నగేశ్‌గా ప్రాచుర్యం పొందిన కె.నాగేశ్వర్రావు కొన్నేళ్లుగా కుటుంబీకులు, బంధువులతో కలసి 2016 వరకు గంజాయి దందా చేశాడు. ఆ తర్వాత హష్ ఆయిల్ విక్రయించడం మొదలుపెట్టాడు. తన స్వస్థలంలోనే గంజాయి పండించి ప్రాసెస్ చేయించేవాడు. అక్కడే హష్ ఆయిల్ తీసి, కిలో చొప్పున ప్యాక్ చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేవాడు. ఈ నేరాలకు సంబంధించి నల్లగొండ టూ టౌన్ పోలీసుస్టేషన్లో అతడిపై 2021లో కేసు నమోదైంది. ఈ కేసులో నగేశ్ కుటుంబీకులు, బంధువులు అరెస్టు అయినా అతడు మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఏడాది హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ ఠాణాలో నమోదైన అశుతోష్ కేసు, నల్లకుంట ఠాణాకు సంబంధించిన ప్రేమ్ ఉపాధ్యాయ కేసులో నగేశ్ నిందితుడు. నగేశ్ దందాలో దళారిగా ఉన్న లక్ష్మీపతి మరో మూడు కేసుల్లో నిందితుడు. లక్ష్మీపతి మాదిరిగా మరో 58 మంది రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, వరంగల్‌లతో పాటు ఒడిశా, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, ముంబై, ఉత్తరప్రదేశ్, బిహార్‌ల్లోనూ నగేశ్‌కు సంబంధించిన 58 మంది పెడ్లర్స్ పరారీలో ఉన్నారు. నల్లగొండలోని పెడ్లర్స్ ఇప్పటికే అరెస్టు అయ్యారు. 100 మంది విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను కస్టమర్లుగా చేసుకుని హష్ ఆయిల్ విక్రయిస్తున్న లక్ష్మీపతి, నగేశ్‌తోపాటు మియాపూర్‌కు చెందిన ఎ.వంశీకృష్ణ, బీరంగూడకు చెందిన విద్యార్థి విక్రమ్ మౌర్యలను హెచ్–న్యూ బృందం అరెస్టు చేసింది. రూ. 50 వేలకు కొని రూ. 6 లక్షలకు అమ్మకం లక్ష్మీపతి హష్ ఆయిల్‌ను నగేష్ నుంచి కిలో రూ.50 వేలకు ఖరీదు చేసి రూ.6 లక్షల వరకు అమ్ముతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి నుంచి దాదాపు రూ.5 లక్షల విలువైన 840 గ్రాముల ఆయిల్ లభించింది. వీరి నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. నగరంలో మాదకద్రవ్యాలపై సమాచారం తెలిసిన వాళ్లు 94906 16688కు అందించాలి. వారి పేర్లు, వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. – చక్రవర్తి గుమ్మి, హెచ్–న్యూ డీసీపీ -
Drugs Case: ‘హెచ్ న్యూ’ అదుపులో లక్ష్మీపతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నమోదైన తొలి డ్రగ్స్ మరణానికి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రేమ్ ఉపాధ్యాయకు హష్ ఆయిల్ సరఫరా చేసిన వీరవల్లి లక్ష్మీపతిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు మంగళవారం పట్టుకున్నారు. గత వారం ప్రేమ్ ఉపాధ్యాయ అరెస్టుతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన లక్ష్మీపతి కోసం హెచ్–న్యూ ముమ్మరంగా గాలించింది. మంగళవారం ఏపీలోని విశాఖ ఏజెన్సీలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకువస్తోంది. ఇతడికి ఈ ఆయిల్ సరఫరా చేస్తున్న అరకు మండలం లోగిలి ప్రాంతానికి చెందిన నగేష్ కోసం గాలిస్తున్నారు. లక్ష్మీపతి అరెస్టును బుధవారం ప్రకటించే అవకాశం ఉంది. ఓ కేసులో 2020 నవంబర్ 27న మల్కాజ్గిరి స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు అరెస్టు చేసిన తర్వాత లక్ష్మీపతి ఇప్పుడు మళ్లీ చిక్కాడు. చదవండి: ఇంటర్నెట్లో అండర్ వరల్డ్‌గా డార్క్ వెబ్! సంగారెడ్డి జిల్లా బీరంగూడలోని తులసి వనం కాలనీకి చెందిన లక్ష్మీపతి తండ్రి ప్రస్తుతం నల్లగొండ పోలీసు విభాగంలో ఆర్ఎస్సైగా పని చేస్తున్నారు. ఏడేళ్ల క్రితం బీటెక్ చదువుతున్న రోజుల్లోనే గంజాయికి బానిసగా మారిన లక్ష్మీపతిపై ఒకటిరెండు కేసులు నమోదు కావడంతో ఆయన కొడుకును పూర్తిగా దూరం పెట్టారు. నగేష్ నుంచి తొలినాళ్లల్లో గంజాయి ఖరీదు చేస్తూ వచ్చిన లక్ష్మీపతి ఆ తర్వాత హష్ ఆయిల్ దందా మొదలెట్టాడు. జూబ్లీహిల్స్, మియాపూర్, మాదాపూర్, భువనగిరి, విశాఖపట్నాల్లో ఇళ్లు అద్దెకు తీసుకుని తన దందా కొనసాగించాడు. హష్ ఆయిల్‌ను ఇసోప్రోపిక్ ఆల్కహాల్‌తో కల్తీ చేసిన చరిత్ర లక్ష్మీపతికి ఉంది. -
మరో వివాదంలో ఆర్ఆర్ఆర్.. ఏం జరిగినా రాజమౌళిదే బాధ్యత
Family Members Object to Alluri Sitaramaraju Role in RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాపై అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రను వక్రీకరించారని ఆయన మనవడు లక్ష్మీపతి రాజు అన్నారు. సినిమాలో ఏది చూపిస్తే ప్రేక్షకులు కూడా అదే నిజమనుకునే ప్రమాదం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు తన జీవితంలో ఎక్కడా డ్యాన్స్ చేయలేదని, బ్రిటీష్ సైన్యంలో పనిచేయలేదని ఆయన అంటున్నారు. సినిమా విడుదలైన తర్వాత అల్లూరి సీతారామరాజు అభిమానులు నొచ్చుకొని జరగరాని సంఘటనలు జరిగితే వాటికి దర్శకుడు రాజమౌళి బాధ్యత వహించాలని ఆయన మనవడు లక్ష్మీపతి రాజు మీడియా ముందుకు వచ్చాడు. ఇదిలా ఉండగా, ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, సీతగా అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: (అమెరికాలో తారక్ అభిమాని అరాచకం.. అన్ని టికెట్స్ కొనేశాడు) -
లక్ష్మీపతిరాజాపై సస్పెన్షన్ ఎత్తివేసిన బీజేపీ
సాక్షి, అమరావతి: బీజేపీ నేత లక్ష్మీపతిరాజాపై ఆ పార్టీ సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాజాపై సస్పెన్షన్‌ను విధించారు. అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆయనపై సస్పెన్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. -
‘టీడీపీ దివాళాకోరు తనానికి నిదర్శనం’
సాక్షి, విజయవాడ : చంద్రబాబు పాలనలో అవినీతి జరిగిందని తాము గతంలోనే చెప్పామని బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా పేర్కొన్నారు. తాజాగా ఐటీ దాడుల ద్వారా అది నిజమని నిరూపితమైందన్నారు. విజయవాడలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు చేసిన అవినీతి నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు. పీఎస్ దగ్గరే రెండు వేల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగాయంటే, ఇక చంద్రబాబు ఎన్ని లక్షల అవినీతి చేసివుంటారోనని అన్నారు. తన అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతోనే రాష్ట్రంలో సీబీఐని రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని ఆరోపించారు. అవినీతిపరుల అక్రమార్జనను కేంద్రం పైసాతో సహా కేంద్ర ఖజానాలో జమచేస్తుందన్నారు. (బాబు ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు: మంత్రి బాలినేని) రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలి చంద్రబాబు ఆయన బినామీలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజీపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ అన్నారు. చంద్రబాబు అవినీతిపై కూడా విచారణ జరుగుతుందని, చంద్రబాబు తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు అవినీతిపై విచారణ కోరాలని, ఐటీ దాడులు రాజకీయ కక్ష్యతో జరుగుతున్నయని టీడీపీ నేతలు మాట్లాడడం వారి దివాళాకోరు తనానికి నిదర్శనమని తెలిపారు. దాడులు చేసేది బీజేపీ కాదని ఐటీ అధికారులని స్పష్టం చేశారు. చంద్రబాబు అవినీతి సొమ్ము ప్రజలకు చేరాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహకరించాలని కోరారు. (దిశ యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే..) రాజకీయాల్లో అత్యంత అవినీతిపరుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్రించిన "ఎంపరర్ ఆఫ్ కరప్షన్ చంద్రబాబు" ఆధారంగా అన్ని అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విచారణ మొదలు పెట్టాలని కాంగ్రెస్ నేత డాక్టర్ గంగాధర్ డిమాండ్ చేశారు. రాజకీయాలు భ్రష్టు పట్టించిన వ్యక్తి, అవినీతి మయం చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. రాజకీయాల్లో అత్యంత అవినీతిపరుడు, దేశంలోనే చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ తక్షణమే విచారణ చేపట్టి చంద్రబాబు అవినీతి గుట్టు విప్పాలని కాంగ్రెస్ నేత నరహరిశెట్టి నరసింహరావు సూచించారు. దామోదరం సంజీవయ్య లాంటి సాధారణ జీవితం గడిపిన సీఎంగా చేసిన చరిత్ర ఏపీకి ఉందని.. ఆయన పుట్టిన రోజున ఒక అత్యంత అవినీతి మాజీ సీఎం చంద్రబాబు చిట్టా వెలుగులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
‘కాల్‌మనీ నిందుతులకు ప్రమోషన్ ఇచ్చిన ఘనత టీడీపీదే’
సాక్షి, గుంటూరు : బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత లక్ష్మీపతి రాజు ఖండించారు. కాంగ్రెస్‌లో అలవాటైన శవ రాజకీయాలను ఎమ్మెల్సీ డొక్కా కొనసాగించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఆకస్మిక ప్రమాదాన్ని ఆసరా చేసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ప్రమాదం జరిగిన తరువాత జీవీఎల్ చాలాసేపు సంఘటనా స్థలంలోనే ఉన్నారని పేర్కొన్నారు. జీవీఎల్ చట్టసభల సభ్యత్వంపై టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఘాటుగా స్పందించారు. కాల్‌మనీ నిందుతులకు ప్రమోషన్ ఇచ్చిన ఘనత టీడీపీదేనని ఎద్దేవా చేశారు. -
నాడు బాలకృష్ణ ‘హీరోయిజం’ ఏమైంది..?
సాక్షి, అమరావతి: టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై రాష్ట్ర బీజేపీ కార్యదర్శి కేవీ లక్ష్మీపతి రాజా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం చేపట్టిన ఒక్కరోజు నిరాహార దీక్షలో కేంద్రంపై, నరేంద్ర మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో లక్ష్మీపతి రాజా.. టీడీపీపై విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ ఒళ్లు తెలియకుండా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఆయనకు మతిభ్రమించిందనీ, అందుకే ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం చేసిన సహకారాన్ని మరచి బరితెగించి చవకబారు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అవినీతి బయట పడితే తన బావ, అల్లుడికి రాజకీయంగా పుట్టగతులుండవనే అభద్రతా భావంతో బాలకృష్ణ పొగరుబోతు మాటలు పేలుతున్నారని అన్నారు. ప్రజలతో నాలుగు విషయాలు నేరుగా చెప్పడం చేతగాని దద్దమ్మ దేశ ప్రధానిపై వ్యాఖ్యలు చేయడమేంటని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది అధర్మ, అవకాశవాద దీక్ష అని అన్నారు. కేంద్రంపై, మోదీపై పెంచుకున్న కక్షను వెల్లడించేందుకే ముఖ్యమంత్రి ఈ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు. తమ అవినీతి, అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ దొంగ దీక్ష చేపట్టారని మండిపడ్డారు. బీజేపీపై, మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది మచ్చుతునక అని లక్ష్మీపతి అన్నారు. తన తండ్రిని చంద్రబాబు వెన్నుపోటు పొడిచి రాజకీయంగా, నైతికంగా చావుదెబ్బతీసినప్పుడు ఈ పౌరషం ఏమైందని బాలకృష్ణను ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై చంద్రబాబు టీడీపీ కార్యకర్తలతో నిర్దాక్షిణ్యంగా చెప్పలు, రాళ్లు వేయించినప్పుడు ఈ ‘హీరోయిజం’ ఎటుపోయిందని బాలకృష్ణకు చురకలంటించారు. టీడీపీ అవినీతి, కుంభకోణాలు బయటపడే సమయం దగ్గర్లోనే ఉందని లక్ష్మీపతి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని చంద్రబాబు ఖండించాలి. మోదీపై చేసిన వ్యక్తిగత విమర్శల్ని వెనక్కి తీసుకుని భేషరతుగా బాలకృష్ణ మోదీకి క్షమాపణలు చెప్పాలని లక్ష్మీపతి డిమాండ్ చేశారు. బాలకృష్ణను పిచ్చాసుపత్రికి తరలించాలి అనంతపురం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్ రెడ్డి ఖండించారు. బాలకృష్ణను పిచ్చాసుపత్రికి తరలించాలని, టీడీపీ నీచ సంస్కృతికి బాలయ్య వ్యాఖ్యలే నిదర్శనమని ఆయన అన్నారు. -
హరిబాబు వర్సెస్ లక్ష్మీపతి
-
ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఇళ్లపై ఏసీబీ దాడులు
అక్రమాస్తుల కేసులో విజయనగరం ఆర్డబ్ల్యూఎస్ ఈఈ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బుధవారం విజయనగరంలోని ఈఈ సీహెచ్ విద్యాసాగర్ నివాసంతోపాటు విశాఖపట్టణం, శ్రీకాకుళంలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఈ సందర్భంగా రూ.కోటి 75 లక్షల మేర ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.