‘కాల్‌మనీ నిందుతులకు ప్రమోషన్‌ ఇచ్చిన ఘనత టీడీపీదే’ | BJP Lakshmipathi Raju Fires On TDP Dokka Manikya Varaprasad | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 25 2018 11:59 AM | Last Updated on Sat, Aug 25 2018 12:02 PM

BJP Lakshmipathi Raju Fires On TDP Dokka Manikya Varaprasad - Sakshi

సాక్షి, గుంటూరు : బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావుపై ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత లక్ష్మీపతి రాజు ఖండించారు. కాంగ్రెస్‌లో అలవాటైన శవ రాజకీయాలను ఎమ్మెల్సీ డొక్కా కొనసాగించటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఆకస్మిక ప్రమాదాన్ని ఆసరా చేసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం సరికాదని అభిప్రాయపడ్డారు. సంఘటన జరిగిన వెంటనే గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారని తెలిపారు.  ప్రమాదం జరిగిన తరువాత జీవీఎల్‌ చాలాసేపు సంఘటనా స్థలంలోనే ఉన్నారని పేర్కొన్నారు. జీవీఎల్‌ చట్టసభల సభ్యత్వంపై టీడీపీ నేతలు మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందని ఘాటుగా స్పందించారు. కాల్‌మనీ నిందుతులకు ప్రమోషన్‌ ఇచ్చిన ఘనత టీడీపీదేనని ఎద్దేవా చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement