
టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
సాక్షి, విశాఖపట్నం: టీడీపీతో పవన్ కల్యాణ్ పొత్తు అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. పొత్తుపై తమ అధిష్టానమే అంతిమ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి బీజేపీ, జనసేన మాత్రం కలిసే ఉన్నాయని తెలిపారు.
కర్ణాటకలో బీజేపీ ఓటమిపై విశ్లేషణ చేసుకుంటామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ఉండవని పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో ఫలితాలు మరొక రాష్ట్రంలో ప్రభావం చూపించవన్నారు.
చదవండి: పవన్ శ్వాస, ధ్యాస బాబే