విజయనగరం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
అక్రమాస్తుల కేసులో విజయనగరం ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బుధవారం విజయనగరంలోని ఈఈ సీహెచ్ విద్యాసాగర్ నివాసంతోపాటు విశాఖపట్టణం, శ్రీకాకుళంలలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు జరిపారు. ఈ సందర్భంగా రూ.కోటి 75 లక్షల మేర ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి తెలిపారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.