
చింతలవీధి జంక్షన్‌లో వాహనచోదకులకు బ్రీత్ ఎన్‌లైజర్ పరీక్షలు చేస్తున్న పోలీసులు
సాక్షి,పాడేరు: మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసుశాఖ తనిఖీలను ప్రారంభించింది. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ పోలీసు స్టేషన్ల పరిఽధిలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు.సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రధాన జంక్షన్‌ల వద్ద పోలీసు బృందాలు వాహన చోదకులకు బ్రీత్ ఎన్‌లైజర్ పరీక్షలు జరుపుతున్నారు.ప్రమాదాలు నివారణ లక్ష్యంగా పోలీసుశాఖ పనిచేస్తుంది.
మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే అనర్థాలను వాహనచోదకులకు పోలీసులు వివరిస్తున్నారు.పాడేరు పట్టణంలోని అన్ని రోడ్లతో పాటు కాన్వెంట్,చింతలవీధి జంక్షన్‌ల వద్ద రోజువారి తనిఖీలను ప్రారంభించారు.రాత్రి సమయంలోను తమ పోలీసు బృందాలు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్నాయని పాడేరు సీఐ సుధాకర్ తెలిపారు.పర్యాటక ప్రాంతాలైన అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని ప్రధాన జంక్షన్‌లు, మండల కేంద్రాల్లో వాహనాల తనిఖీలను మమ్మురం చేశామని, ఇటీవల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈమూడు స్టేషన్ల పోలీసు బృందాలను మరింత అప్రమత్తం చేసినట్టు అరకులోయ సీఐ జి.దేముడుబాబు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment