దానికి ఎంతో ధైర్యం కావాలి | 'Chandi', a heroine oriented movie to be released on 8th | Sakshi
Sakshi News home page

దానికి ఎంతో ధైర్యం కావాలి

Published Tue, Nov 5 2013 12:21 AM | Last Updated on Fri, Aug 17 2018 8:01 PM

దానికి ఎంతో ధైర్యం కావాలి - Sakshi

దానికి ఎంతో ధైర్యం కావాలి

‘‘ప్రస్తుత ట్రెండ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు తీయాలంటే ఎంతో ధైర్యం కావాలి. అందుకే ‘చండీ’ నిర్మాతలను కచ్చితంగా మెచ్చుకోవాలి’’ అని కృష్ణంరాజు అభినందించారు. ప్రియమణి టైటిల్ రోల్ పోషించిన ‘చండీ’లో కృష్ణంరాజు శక్తిమంతమైన పాత్ర చేశారు. సముద్ర దర్శకత్వంలో డాక్టర్ శ్రీనుబాబు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది.

ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కృష్ణంరాజు మాట్లాడుతూ -‘‘ఈ కథతో పాటు, నా పాత్ర బాగా నచ్చింది కాబట్టే చేయడానికి అంగీకరించాను. ఇందులో నాపై చిత్రీకరించిన అల్లూరి సీతారామరాజు పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని తెలిపారు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించాలన్న కృష్ణంరాజు ఆశయం మా చిత్రం ద్వారా నెరవేరినందుకు ఆనందంగా ఉందని సముద్ర చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో జీవీ, శంకర్, వాసు, శ్రీనుబాబు తదితరులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement