ఇచ్చిన మాట ప్రకారమే బీసీ కులగణన
ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్‌ఎస్ దృష్టి
ప్రజలకు మంచి చేయడమే ప్రభుత్వ వైఫల్యమా?
నెహ్రూ జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి
సాక్షి, హైదరాబాద్: అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత పెంచడానికే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చె ప్పారు. రాష్ట్రంలో బీసీ కులగణన నిర్వహిస్తామని ఇ చ్చిన మాటకు కట్టుబడి సర్వే నిర్వహిస్తున్నామని పే ర్కొన్నారు.
గురువారం ఆయన గాం«దీభవన్‌లో భా రత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియా తో మాట్లాడుతూ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతోందని అన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే కుటుంబ సర్వే కు సంబంధించి ప్రశ్నలు తయారు చేసినట్లు చెప్పారు.
ప్రభుత్వాన్ని కూల్చటమే బీఆర్‌ఎస్ లక్ష్యం
తమ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చెప్పాలని భట్టి విక్రమార్క సవాల్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుచేయటం, రైతు రుణమాఫీ, ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యాలా? అని ప్రశ్నించారు.
అధికారం పోయిందన్న అక్కసుతో అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్‌ఎస్ దృష్టి పెట్టిందని ఆరోపించారు.
నెహ్రూ ఆశయాలు కొనసాగిస్తాం
నెహ్రూ ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment