
రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారిణి చాకలి ఐలమ్మ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల నిధులు కేటాయించిందని రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఉత్స వాలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఐలమ్మ జయంత్యుత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించా రు. ఈనెల 26న రవీంద్ర భారతిలో జరిగే జయంతి కార్యక్రమాల కోసం రూ.12 లక్షలు కేటాయించామని, అలాగే ఈ నెల 10న జరిగే వర్ధంతి కార్యక్రమం కోసం రూ.3 లక్షలు కేటాయించినట్లు పొన్నం వెల్లడించారు.
ఈ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి చైర్మన్‌గా షాద్‌నగర్ శాసనసభ్యుడు వీర్లపల్లి శంకర్ వ్యవహరిస్తారన్నారు. ఈ కమిటీలో 40 మంది సభ్యులను కూడా నియమించినట్లు చెప్పారు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ స్మారక భవన నిర్మాణానికి ఉన్న అనువైన స్థలాన్ని గుర్తించాలని, ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీరెడ్డికి మంత్రి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment