బళ్లారి రాఘవ
బళ్లారి : కర్ణాటక, ఆంధ్రా నాటక పితామహుడు బళ్లారి రాఘవ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాఘవ మెమోరియల్ అసోసియేషన్ నిర్ణయించింది. ఆగస్టు 2,3 తేదీలలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు రాఘవ మెమోరియల్ అసోసియేషన్ అధ్యక్షుడు సిద్దనగౌడ తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా బళ్లారి రాఘవ పేరు మీదుగా తెలుగు, కన్నడ కళాకారులకు రాష్ట్ర, జిల్లా స్థాయి అవార్డులు ఇవ్వనున్నారు.
తెలుగు, కన్నడ భాషలలో రాష్ట్ర, జిల్లా స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన పలువురు కళాకారులను ఎంపిక చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో ఎస్.నాగన్న, ప్రేమా పాటిల్ ఉన్నారు. జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికైన వారిలో ఆళ్ల వెంకటరెడ్డి, జెటి.ప్రవీణ్‌కుమార్, కె.మధుసూధన్‌రావ్, కె.సురేంద్ర బాబు, సీజీ లతాశ్రీ, ఎం.ఎల్.రంగస్వామీ, నాగభూషణ నాగళ్లి, పత్తార్ ఖాదర్‌సాబ్, రమేష్‌గౌడ పాటిల్, వీ.ఎన్.గిరిమల్లప్ప ఉన్నారు. జయంతోత్సవం రోజున వారికి నగదు బహుమతితోపాటు ఓ మొమెంటోను బహూకరిస్తారు.