95వ జయంతి మహోత్సవం | akkineni nageswara rao 95 jayanthi mahotsavam | Sakshi
Sakshi News home page

95వ జయంతి మహోత్సవం

Published Sat, Sep 15 2018 2:58 AM | Last Updated on Sat, Sep 15 2018 2:58 AM

akkineni nageswara rao 95 jayanthi mahotsavam - Sakshi

దాదా సాహెబ్‌ఫాల్కే, పద్మవిభూషణ్‌ అవార్డుల గ్రహీత, స్వర్గీయ నటుడు డాక్టర్‌ అక్కి నేని నాగేశ్వరరావు 95వ జయంతి మహోత్సవం ఈ నెల 19న జరగనుంది. ‘రసమయి’ సంస్థ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో ‘అక్కినేని ఆలోచనలు’ సంస్కృత అనువాధ గ్రంథం ‘అక్కినేని అనుచింతనాని’, అక్కినేని ప్రత్యేక తపాలా చంద్రిక (అక్కినేని స్పెషల్‌ పోస్టర్‌ కవర్‌) ఆవిష్కరణలు ఉంటాయి.

ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్‌ డా. కె. రోశయ్య, సభాధ్యక్షులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనమండలి పూర్వ చైర్మెన్‌ డా.ఎ. చక్రపాణి, చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ బ్రిగేడియర్‌ బి. చంద్రశేఖర్, డా. బి.వాణీదేవి తదితరులు పాల్గొంటారు. అలాగే అదే రోజు శ్రీ త్యాగరాయ గానసభలో ‘మహానటులు అక్కినేని’ శీర్షికన ఎం.కె రాము రచించిన సంగీతరూపక ప్రదర్శన ఉంటుందని ‘రసమయి’ అధ్యక్షులు ఎం.కె. రాము తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement