Tirupur
-
భయం వద్దు..తమిళులు మంచివారు
చెన్నై: తమిళనాడు ప్రజలు ఎంతో మంచివారని, స్నేహభావంతో ప్రవర్తిస్తారని రాష్ట్ర గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఉత్తరాది వలసకార్మికులపై దాడులు జరుగుతున్నాయంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని వారిని కోరారు. అభద్రతా భావానికి, భయాందోళనలకు లోనుకావద్దన్నారు. ఈ మేరకు ఆయన పలు ట్వీట్లు చేశారు. కాగా, వలసకార్మికుల భద్రతపై పుకార్ల నేపథ్యంలో బిహార్ అధికారుల బృందం తిరుపూర్‌లోని దుస్తుల కర్మాగారాలను సందర్శించింది. అక్కడి దుస్తుల కర్మాగారాల్లో పనిచేసే వలస కార్మికుల భద్రతపై అక్కడి అధికారులతో చర్చలు జరిపి, సంతృప్తి వ్యక్తం చేసింది. వదంతులకు కారకులుగా హిందీ వార్తా పత్రికకు చెందిన ఇద్దరు జర్నలిస్టులపై పోలీసులు కేసులు పెట్టారు. బీజేపీ తమిళనాడు చీఫ్ అన్నామలైపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. దీనిపై అన్నామలై స్పందించారు. ‘ఉత్తరాది సోదరులకు వ్యతిరేకంగా డీఎంకే 7 దశాబ్దాలుగా సాగిస్తున్న దుష్ప్రచారాన్ని బయట పెట్టినందుకే నాపై కేసు పెట్టారు. చేతనైతే అరెస్ట్ చేయాలి’అని ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమిళనాడులో వలసకార్మికులపై దాడులు వార్తలకు కేంద్రంపై కారణమని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఆరోపించారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. -
ఎస్సీ విద్యార్ధుల చేత టాయిలెట్లు కడిగించిన ప్రధానోపాధ్యాయురాలు
Chennai Police complaint has been registered against Govt School headmistress తిరుపూర్: తమిళనాడులోని తిరుపూర్‌కు చెందని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్ధులచేత బలవంతంగా టాయిలెట్లు శుభ్రం చేయించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై విద్యార్ధులు శుక్రవారం చీఫ్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (సీఈఓ) ఆర్ రమేష్‌కు పిర్యాదు చేయడంతో, ప్రధానోపాద్యాయురాలు సప్పెండ్ అయ్యింది. తమిళనాడులోని తిరుపూర్‌లోని ఇడువై గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 14 మంది ఉపాధ్యాయులు, 400 మంది విద్యార్ధులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయురాలు గీత (45) మూడేళ్లగా ఈ పాఠశాలలో పనిచేస్తుంది. ఐతే 9, 10వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఆమెపై చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో) ఆర్ రమేష్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు తమను కులం పేరుతో దుర్భాషలాడిందని, మరుగుదొడ్లు శుభ్రం చేయమని బలవంతం చేసిందని విద్యార్థులు ఆరోపించినట్లు రమేష్ తెలిపారు. పాఠశాలను సందర్శించి విచారణ చేసిన అనంతరం ఆమెను సస్పెండ్ చేసినట్లు, సమగ్ర విచారణ నిమిత్తం పోలీసులకు పిర్యాదు చేసినట్లు రమేష్ మీడియాకు తెలిపారు. కాగా ప్రధానోపాధ్యాయురాలుపై షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (వేధింపుల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
అచ్చం సినిమాలా? వ్యాపారి కుమారుడు కిడ్నాప్.. గంటల్లో..
చెన్నె: ఇటీవల కొత్త తరహా నేరాలు చోటుచేసుకుంటున్నాయి. కొత్త తరహాలో నేరాలు జరుగుతుండడంతో పోలీసులకు సవాల్‌గా మారింది. అయితే సినిమాల్లో చూపించిన మాదిరి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. తాజాగా అచ్చం సినిమా కథ మాదిరే తమిళనాడులో ఓ సంఘటన జరిగింది. వ్యాపారి కుమారుడిని కొందరు కిడ్నాప్ చేసి డబ్బులు ఇస్తేనే వదిలిపెడతామని హెచ్చరించారు. డబ్బుతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ యువకుడు కిడ్నాపర్ల చెర నుంచి క్షేమంగా బయటపడ్డాడు. తిరుప్పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త ఈశ్వరమూర్తి కుమారుడు శివప్రదీప్ (22) కడయూరులోని రైస్ మిల్లుకు ఆదివారం రాత్రి కారులో శివప్రదీప్ వెళ్తున్నాడు. వీరచోళపురం ప్రాంతానికి చేరుకోగానే మొత్తం ఏడు మందితో కూడిన గ్యాంగ్ అతడి వాహనాన్ని అడ్డుకున్నారు. శివప్రదీప్‌ను వెంటనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అనంతరం డబ్బుల కోసం యువకుడి తండ్రికి ఫోన్ చేశారు. రూ.3 కోట్లు ఇస్తేనే కుమారుడిని వదిలేస్తామని హెచ్చరించారు. కిడ్నాపర్ల హెచ్చరికలతో భయపడిన అతడి తండ్రి అడిగిన మొత్తాన్ని ఇచ్చేయడంతో కిడ్నాపర్లు ఆ యువకుడిని వదిలేశారు. (చదవండి: సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్) అయితే రూ.మూడు కోట్లు అప్పనంగా పోయాయని భావించిన ఈశ్వరమూర్తి కాంగేయం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బును స్వాధీనం చేసుకుని వ్యాపారవేత్తకు అప్పగించారు. గంటల వ్యవధిలోనే పోలీసులు ఈ కేసును చేధించారు. వారిలో ముగ్గురి నుంచి రూ.1.69 కోట్లు, మరొకరి నుంచి రూ.20.44 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన ఆరు గంటల వ్యవధిలోనే పోలీసులు కేసు చేధించడంపై పోలీస్ ఉన్నతాధికారులు అభినందించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా కేసును సులువుగా చేధించారు. చదవండి: చీరకట్టులో కుందనపు బొమ్మలా ‘పీవీ సింధు’ -
సిరిసిల్లను మరో తిరుపూర్ చేస్తా
సాక్షి, సిరిసిల్ల: సిరిసిల్లను మరో తిరుపూర్‌గా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం పద్మశాలీల ఆరాధ్య దైవం మార్కండేయ జయంతి సందర్భంగా సిరిసిల్లలో నిర్వహించిన శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. తనకు రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్లకు కన్నతల్లిలాగే రుణపడి ఉంటానని చెప్పారు. ఏటా రూ.36 వేల కోట్ల వస్త్రోత్పత్తి చేస్తున్న తమిళనాడులోని తిరుపూర్ స్థాయికి సిరిసిల్లను తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా త్వరలోనే అపరెల్ పార్కును ప్రారంభిస్తామని, 10 వేల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు, ఆర్వీఎం ఆర్డర్లతో కొంతవరకు నేతన్నలకు ఉపశమనం లభించిందని పేర్కొన్నారు. చేసింది కొంతేనని, చేయాల్సింది ఇంకెంతో ఉందన్నారు. నేతన్నల నైపుణ్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన వస్త్రపరిశ్రమను మరింత ముందుకు తీసుకెళ్తానన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు రూ.4.30 కోట్లతో ఎనిమిది అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. పేదలకు రూ.5 భోజనం అందించే అన్నపూర్ణ, వైకుంఠధామం, ఇందిరాపార్క్, ఏకలవ్య కమ్యూనిటీ భవనం, ఓపెన్ జిమ్, తడి, పొడి చెత్తను సేకరించేందుకు బ్యాటరీతో నడిచే వాహనాలు, స్త్రీనిధి మహిళలకు ట్యాబ్‌లు, బతుకమ్మ ఘాట్ వద్ద మ్యూజికల్ ఫౌంటేన్‌ను ప్రారంభించారు. -
తిరుపూరులో పెరియార్ విగ్రహం ధ్వంసం
చెన్నై/తిరుపూరు: ప్రఖ్యాత ద్రవిడ ఉద్యమకారుడు పెరియార్ 139వ జయంతిరోజైన సోమవారమే తమిళనాడులోని తిరుపూరు జిల్లాలో ఆయన విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. చెన్నైలోనూ పెరియార్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళి అర్పిస్తుండగా ఓ వ్యక్తి విగ్రహంపైకి బూటు విసిరాడు. తిరుపూరులోని ధరపురంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినవారి కోసం గాలిస్తున్నామనీ, బూటు విసిరిన యువకుడిని ఇప్పటికే అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే, ఈ పార్టీల మాతృసంస్థ ద్రవిడార్ కళగం, ఇతర పార్టీలు ఈ ఘటనలను ఖండించాయి. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని మత్స్యశాఖ మంత్రి జయకుమార్ చెప్పగా, నిందితులపై జాతీయ భద్రతాచట్టం కింద కేసు నమోదు చేయాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. -
ఆరేళ్ల పిల్లాడికి కరాటే, యోగా ఫీజు..!
తిరుపూర్/తిరువనంతపురం : ఒకటో తరగతి విద్యార్థికి కరాటే, యోగ ఫీజు కింద 20 వేల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో ఆ పిల్లాడి తండ్రి షాక్ గురయ్యాడు. ఆరేళ్ల పిల్లాడికి యోగా, కరాటే ఎందుకని ప్రశ్నించడంతో స్కూలు యాజమాన్యం వారిని గేటు బయటే నిల్చోబెట్టింది. అయినా, ప్రభుత్వ సహకారంతో విద్యనభ్యసిస్తున్న తన కొడుక్కి ఫీజు ఎలా వసూలు చేస్తారని ఆ తండ్రి మంగళవారం ఉదయం నుంచి గేటు బయటే నిరసన వ్యక్తం చేస్తున్నాడు. వివరాలు.. ‘విద్యా హక్కు చట్టం - 2009’ (ఆర్టీఈ) ప్రకారం అన్ని ప్రైవేటు, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థుల కోసం 25 శాతం సీట్లు కేటాయించాలి. తిరుపూర్‌లోని కొంగు వెల్లలార్ ప్రైవేటు పాఠశాలలో గాంధీజీ అనే విద్యార్థి ఆర్టీఈ కోటాలో ఒకటో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగానే తన కొడుకు గాంధీజీని స్కూల్లో దింపడానికి వచ్చిన పళనికుమార్‌కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ‘ఎక్స్ట్రా కరిక్యులర్’ ఫీజుల కింద 20 వేల రూపాయలు చెల్లించాలని అతన్ని స్కూలు యాజమాన్యం డిమాండ్ చేసింది. ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న తన కొడుకుపై ఈ ఫీజుల భారమేంటో పళని కుమార్‌కు అర్థం కాలేదు. కరాటే, యోగా, లైబ్రరీ, తమిళ్, ఇంగ్లిష్ హ్యాండ్ రైటింగ్, టేబుల్ టెన్నిస్ అంటూ చాంతాడంతా ఫీజుల చిట్టాను పాఠశాల సిబ్బంది అతని చేతిలో పెట్టారు. గాంధీజీతో పాటు ఆర్టీఈ కోటాలో విద్యనభ్యసిస్తున్న మరో ఇద్దరు విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. పళనికుమార్ ఆందోళనకు ఆ విద్యార్థుల తండ్రి సెల్వం కూడా తోడయ్యారు. చేతిలో ప్లకార్డులతో వారంతా నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న తిరుపూర్ తహసీల్దార్ స్పందించారు. స్కూలు యాజమాన్యంతో చర్చలు జరిపారు. ప్రభుత్వం కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లిస్తుందనీ, ఎక్స్ట్రా కరిక్యులర్ ఫీజు చెల్లింపు తప్పనిసరని తేల్చారు. అరవై రోజుల గడువుతో ఫీజు చెల్లించాలనే షరతుతో విద్యార్థులను తరగతులకు అనుమతించారు. అయితే, తహసీల్దార్ స్కూలు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారనీ, అందుకే ఫీజు చెల్లించమంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంకా ఎందరో ఆర్టీఈ కోటాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్స్ట్రా ఫీజులతో సతమతమవుతున్నారనీ, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. -
ఢిల్లీలో మిస్టరీ.. ఇన్సులిన్ ఎక్కించి హత్య?
సాక్షి, చెన్నై: ఉన్నత చదువుకు ఢిల్లీ వెళ్తున్న తమిళ విద్యార్థులకు భద్రత కరవు అవుతోంది. ప్రధానంగా వైద్య కోర్సుల్ని అభ్యషించేందుకు వెళ్తున్న విద్యార్థుల మరణాలు ఓ మిస్టరీగా మారుతున్నాయి. ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన శరవణన్ మరణం కలకలం రేపగా, ప్రస్తుతం శరత్ ప్రభు మరణం ఆందోళనలో పడేసింది. విషం ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేసి ఉండొచ్చన్న అనుమానాలకు బలం చేకూరే రీతిలో శరవణన్ మరణ మిస్టరీ విచారణ కొలిక్కి వస్తున్నది. ఈ సమయంలో అదే తిరుప్పూర్‌కు చెందిన మరో విద్యార్థి శరత్ ప్రభు విగతజీవిగా మారడం ఉన్నత చదువు నిమిత్తం ఢిల్లీలో ఉన్న తమిళ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన తప్పడం లేదు. నిన్న శరవణన్.. నేడు శరత్.. దేశ రాజధాని నగరం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆస్పత్రుల్లో ఒకటి. ఇందులో ఢిల్లీ విద్యార్థులే కాదు, తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వైద్య ఉన్నత విద్యను అభ్యషిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం తిరుప్పూర్‌కు చెందిన వైద్య పీజీ ఎండీ విద్యను అభ్యషిస్తున్న శరవణన్ అనుమానాస్పద మరణం తమిళనాట కలకలాన్ని రేపింది. ఆ కేసు విచారణ నేటికీ సాగుతోంది. ఇది ముమ్మాటికి హత్యేనని వాదించే వాళ్లు ఎక్కువే. రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలు, సంస్థలు, రాజకీయ పార్టీల పట్టుతో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. కోర్టు రీ పోస్టుమార్టం ఆదేశాలతో వచ్చిన నివేదికలో ఇన్సులిన్ ద్వారా హత్య చేసి ఉండడానికి కారణాలు ఉన్నట్టుగా తేలింది. దీంతో అనుమానాలకు బలం చేకూరే విధంగా కోర్టు విచారణ సాగుతూ వస్తున్నది. ఈ నేపథ్యంలో బుధవారం అదే తిరుప్పూర్‌కు చెందిన శరత్ ప్రభు(25) మరణం ఢిల్లీలో తమిళ విద్యార్థులకు భద్రత కరువైందన్న విషయాన్ని తేట తెల్లం చేసింది. శరత్ మరణంతో ఆందోళన: తిరుప్పూర్ జిల్లా పారప్పాళయం మంగళం సమీపంలోని ఇడువం పాళయం ప్రాంతానికి చెందిన సెల్వమణి , ధనలక్ష్మి దంపతుల కుమారుడు శరత్ ప్రభు(25) కోయంబత్తూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తాను చదువుకున్న చదువు, మార్కులు, ప్రతిభకు గాను ఢిల్లీ ఎయిమ్స్ పరిధిలోని యూసీఎంఎస్ వైద్య కళాశాలలో ఎండీ ఉన్నత కోర్సు సీటు దక్కించుకున్నారు. చివరి సంవత్సరం చదువుకుంటున్న శరత్ బాత్ రూమ్‌లో జారి పడ్డట్టు, మరి కాసేట్లో మరణించినట్టు వచ్చిన సమాచారం ఆ కుటుంబంలోనే కాదు ఢిల్లీలో ఉన్నత కోర్సుల్ని అభ్యషిస్తున్న తమిళ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన బయలు దేరింది. అనుమానాలు.. ప్రతిరోజూ తల్లిదండ్రులతో మాట్లాడే శరత్ ప్రభు మంగళవారం కూడా అదే చేశాడు. రాత్రి పదిన్నర గంటల వరకు తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి నిద్రకు ఉపక్రమించాడు. ఢిల్లీలోని యూసీఎంఎస్ కళాశాల హాస్టల్లో ఉంటున్న సహచర విద్యార్థుల నుంచి ఉదయాన్నే వచ్చిన ఫోన్‌కాల్ సెల్వమణి, ధనలక్ష్మి దంపతుల్ని కలవరంలో పడేశాయి. బుధవారం ఉదయం బస చేసి ఉన్న గదిలోని బాత్రూమ్లో శరత్ కింద పడ్డట్టు, ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్టుగా తొలుత ఓ ఫోన్‌కాల్ రావడం, మరి కాసేపటికి బాత్రూమ్లో పడి మరణించినట్టుగా వచ్చిన సమాచారాలతో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగింది. సహచర విద్యార్థుల నుంచి వచ్చిన పొంతన లేని సమాచారాలతో శరత్ మరణంలో అనుమానాలు బయలు దేరాయి. అదే సమయంలో శరత్ ప్రభు తండ్రి సెల్వమణి దృష్టికి కళాశాల నిర్వాహకులు తెచ్చిన సమాచారంలోనూ అనుమానాలు కొట్టొచ్చినట్టు కన్పించడంతో ఢిల్లీలో ఏదో జరిగిందన్న ఆందోళన తప్పడం లేదు. తక్షణం విమానం ద్వారా ఢిల్లీకి సెల్వమణి, ఆయన స్నేహితులు బయలు దేరి వెళ్లారు. శరవణన్ మరణ సమాచారం తరహాలోనే శరత్ మరణ సమాచారాలు ఉండడంతో ఇన్సులిన్ వేసి హతమార్చి, నాటకం సాగుతున్నదా అన్న అనుమానాల్ని వ్యక్తం చేసే వాళ్లు అధికమే. ముమ్మాటికి హత్యే.. శరత్ ప్రభు మరణ సమాచారంతో గతంలో తనయుడు శరవణన్‌ను కోల్పోయిన తండ్రి గణేషన్ మీడియా ముందుకు వచ్చారు. తన కుమారుడి వేల శరత్‌ను కూడా హతమార్చి నాటకం సాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. తాను న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నానని, అందులో నిజాలు బయటకు వస్తున్నాయన్నారు. తమిళ విద్యార్థులకు ఢిల్లీలో భద్రత లేనే లేదని గతంలోనూ చెప్పాను అని, ఇప్పుడు కూడా తాను చెబుతున్నానని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, తమిళ ప్రభుత్వం చోద్యం చూస్తున్నాయని, విద్యార్థులకు భద్రత కల్పించడంలో విఫలం అయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మరో తమిళ విద్యార్థి బలి కాకుండా భద్రత కల్పించాలని, ఇందుకు విద్యార్థిలోకం గళం విప్పాలని పిలుపునిచ్చారు. ఈ మరణాల గురించి సీఎం పళనిస్వామిని మీడియా ప్రశ్నించగా, ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదవుకుంటున్న విద్యార్థులు తమ పేర్లను రాష్ట్ర ప్రభుత్వంలో నమోదు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఎవరు ఎక్కడ చదువుకుంటున్నారో అన్న గందరగోళం తప్పడం లేదన్నారు. ఇకనైనా తమ పేర్లను విద్యార్థులు నమోదు చేసుకోవాలని, విద్యార్థులకు భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
ఎమ్మెల్యే సోదరుని ఇంటిపై బాంబు దాడి
కేకే.నగర్: తిరుపూర్ జిల్లా తారాపురం చిన్నియప్ప నగర్ ప్రాంతానికి చెందిన దైవశిఖామణి గాంగేయం ఎమ్మెల్యే తని అరసుకు సోదరుడు. అతడు తమిళనాడు కొంగు యువజన సమాఖ్య ప్రాంతీయ కమిటీ సభ్యుడు. సోమవారం ఉదయం దైవశిఖామణి ఇంటికి కొందరు నిఘా వేయడం చూసి దైవశిఖామణి తారాపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన దైవశిఖామణి తన కుటుంబ సభ్యులతో పాటు మిద్దెపై నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో బైక్‌లో వచ్చిన ముగ్గురు పెట్రోల్ బాంబులను దైవశిఖామణి ఇంటి పైకి విసిరారు. ఇంకనూ దైవశిఖామని మోపెడ్‌పై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. తని అరసు ఎమ్మెల్యేకు, దైవశిఖామణికి పాతకక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దైవశిఖామణి చెన్నైకు వెళ్లి కారులో తారాపురం వస్తుండగా తని అరసు అనుచరులు దాడికి ఫ్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దాడులకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
దుకాణంలోకి దూసుకెళ్లిన బస్సు: ముగ్గురి మృతి
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: తిరుపూర్‌లో అర్ధరాత్రి సమయంలో ఆమ్ని బస్సు సెల్ ఫోన్ దుకాణంలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి తిరువనంతపురానికి సోమవారం సాయంత్రం ప్రైవేటు ఆమ్ని బస్సు బయలు దేరింది. బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ధర్మపురి జిల్లా తొరపూరుకు చెందిన రాజ (30) బస్సు డ్రైవర్‌గా ఉన్నాడు. అర్ధ రాత్రి ఒంటిగంట సమయంలో తిరుపూర్ కరుమారం పాళయంలో ఉన్న ఊత్తుకుళి రోడ్డులో బస్సు వెళుతోంది. ఆ సమయంలో వెనుక వస్తున్న బనియన్ కంపెనీ బస్సు ఈ ఆమ్ని బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. దీంతో ఆమ్ని బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సెల్‌ఫోన్ దుకాణంలోకి దూసుకువెళ్లింది. అర్ధ రాత్రి సమయం కావడంతో దుకాణం మూసి ఉంది. వేగంగా ఢీకొనడంతో బస్సు ముందు భాగం పూర్తిగా దుకాంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మొబైల్ దుకాణానికి సమీపంలో ఉన్న చేపల దుకాణం ధ్వంసం అయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ రాజా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు బస్సు ముందు భాగంలో కూర్చున్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. 22 మంది ప్రయాణికులు తీవ్రం గాయపడ్డారు. మృతి చెందిన ప్రయాణికులు కేరళ ఆలంపుళకు చెందిన సాయి యోగ శర్మ (21) అని, చెన్నైకు చెందిన లియో (37) అని తెలిసింది. ఈ సంఘటనపై తిరుపూర్ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు.