ఎమ్మెల్యే సోదరుని ఇంటిపై బాంబు దాడి | Petrol bombs hurled at MLA's brother house in Tirupur | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సోదరుని ఇంటిపై బాంబు దాడి

Published Wed, Aug 24 2016 10:04 AM | Last Updated on Tue, Oct 30 2018 5:17 PM

Petrol bombs hurled at MLA's brother house in Tirupur

కేకే.నగర్: తిరుపూర్ జిల్లా తారాపురం చిన్నియప్ప నగర్ ప్రాంతానికి చెందిన దైవశిఖామణి గాంగేయం ఎమ్మెల్యే తని అరసుకు సోదరుడు. అతడు తమిళనాడు కొంగు యువజన సమాఖ్య ప్రాంతీయ కమిటీ సభ్యుడు. సోమవారం ఉదయం దైవశిఖామణి ఇంటికి కొందరు నిఘా వేయడం చూసి దైవశిఖామణి తారాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన దైవశిఖామణి తన కుటుంబ సభ్యులతో పాటు మిద్దెపై నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో బైక్‌లో వచ్చిన ముగ్గురు పెట్రోల్ బాంబులను దైవశిఖామణి ఇంటి పైకి విసిరారు. ఇంకనూ దైవశిఖామని మోపెడ్‌పై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. విచారణ చేపట్టారు.

తని అరసు ఎమ్మెల్యేకు, దైవశిఖామణికి పాతకక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దైవశిఖామణి చెన్నైకు వెళ్లి కారులో తారాపురం వస్తుండగా తని అరసు అనుచరులు దాడికి ఫ్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దాడులకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement