Petrol bombs
-
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
సాక్షి, నరసరావుపేట, నరసరావుపేట టౌన్ :నరసరావుపేటలో రాజకీయాలను ‘పచ్చ’ దండు వ్యక్తిగత కక్షగా మార్చి, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఓటమి భయంతో టీడీపీ అరాచకం సృష్టిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు.. చివరకు ఓటు వేసిన వారి ఇళ్లపై విధ్వంసానికి పూనుకుంది. పల్నాడు ప్రాంతంలో ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీల మధ్య గొడవలు ఎన్నో ఏళ్లుగా రగులుతూనే ఉంటాయి. ఎన్నికల అనంతరం ఆ పగలు చల్లారి, అన్నదమ్ముల్లా కలసిమెలసి ఉంటారు. అయితే ఈ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకత్వం సరికొత్త ప్రతీకారానికి తెర తీసింది.గత ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకుని మరోసారి పోటీకి దిగిన నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుకు మళ్లీ ఓటమి ఖాయమని పోలింగ్‌కు ముందే అన్ని సర్వేలు తేల్చాయి. దీంతో ఆయన వెన్నులో వణుకు పుట్టింది. ఈ క్రమంలో ప్రత్యర్థిని అడ్డు తొలగించుకుంటే తన గెలుపు ఖాయమని భావించి, నరసరావుపేటలో విధ్వంసానికి ప్రణాళిక రచించారని సమాచారం. ఇందులో భాగంగా పోలింగ్ రోజున నరసరావుపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైకి సుమారు 200 మంది టీడీపీ రౌడీలు మారణాయుధాలతో పట్టపగలు దాడికి వెళ్లారు. ఆ సమయంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన మామ కంజుల రామకోటిరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనపై అరవింద్‌బాబుతో పాటు మరో 30 మందిపై నరసరావుపేట టూటౌన్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కాగా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మట్టుబెట్టాలనే పథకంతోనే ఆయన ఇంటిపైకి దాడికి వచ్చినట్లు తెలిసింది. ఈ దాడికి ఇతర రాష్ట్రాల నుంచి బౌన్సర్లు, కిరాయి రౌడీలను అరవింద్ బాబు పోలింగ్ ముందు రోజు రాత్రికే రప్పించినట్టు సమాచారం.అరవింద బాబు ఇంట్లో పెట్రోల్ బాంబులు, వేట కొడవళ్లు గొడవల నేపథ్యంలో పోలింగ్ అనంతరం టీడీపీ అభ్యర్థి అరవింద బాబును పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఆ సయమంలో ఆయన ఇంట్లో (ఇల్లు, ఆస్పత్రి ఒకచోటే) సోదాలు నిర్వహించగా.. పెట్రోల్ బాంబులు, ఇనుప రాడ్లు, వేట కొడÐ] ళ్లు, కంకర రాళ్లు, ఇతర మారణాయుధాలు దొరికాయి. పోలింగ్‌కు ముందుగానే వీటిని తీసుకొచ్చి ఉంచినట్లు సమాచారం.ఈ ఎన్నికల్లోనూ ఓటమి ఖాయమని తేలడంతో గోపిరెడ్డిని అడ్డు తొలగించుకోవాలనే మారణాయుధాలు తెప్పించినట్లు తెలిసింది. మారణాయుధాలకు సంబంధించిన వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయినా పోలీసులు ఇందుకు సంబంధించి ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం గమనర్హం. పోలీసు పెద్దల అనుమతి రాకపోవడం వల్లే అరవింద్బాబుపై కేసు నమోదు కాలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా నరసరావుపేటలో అల్లర్ల కారణంగా రెండు రోజుల పాటు దుకాణాలు బంద్ చేయాలని పోలీసులు ఆదేశించారు. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగేలా ఉంది. దీంతో ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ స్వార్థ రాజకీయాల కోసం తాము ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇలాగైతే తామెలా బతకాలని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లిలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. పెట్రోల్ బాంబులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 2 షాపులు, నాలుగు బైక్‌లు దగ్ధమయ్యాయి. పలువురు గాయపడ్డారు.పల్నాడు జిల్లా చాగంటివారిపాలెంలో కన్నా లక్ష్మీనారాయణ దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ బూత్ దగ్గర పెద్ద సంఖ్యలో మహిళలు వేచి ఉండగా, 20 మంది రౌడీలతో పోలింగ్ బూత్‌కు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ.. మహిళలను వెనక్కి పంపి పోలింగ్ ఆపాలంటూ జూలుం ప్రదర్శించారు. -
కావేరీ విధ్వంసం
కర్ణాటకలో తమిళుల ఆస్తుల విధ్వంసంపై ప్రతీకారేచ్చ రగిలింది. రాష్ట్రంలో పలుచోట్ల కర్ణాటక వాహనాలను ధ్వంసం చేశారు. చెన్నైలో కన్నడిగుల ప్రముఖ హోటల్‌పై పెట్రోబాంబులు విసిరేసి విధ్వంసానికి పాల్పడ్డారు. దీంతో రాష్ట్రంలోని కర్ణాటక బ్యాంకులు, కార్యాలయాలకు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి రాష్ట్రానికి కావేరి జలాలు విడుదలయ్యా యి. సెకనుకు 15వేల ఘనపుటడుగుల చొప్పున పదిరోజులపాటూ విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును కర్ణాటకలోని ఆందోళనకారులు తీవ్రంగా నిరసిస్తున్నారు. సుప్రీం తీర్పు వెలువడిన నాటి నుంచి ఆందోళనలు, విధ్వంసకర చర్యలను ఆరంభించిన ఆందోళనకారులు సోమవారం తమ మోతాదును మరింతగా పెంచారు. తమిళనాడుకు మరో 3 టీఎంసీలను ఈ నెల 20వ తేదీ వరకు విడుదల చేయాలని ఆదేశించడంతో ఆందోళనకారులు రెచ్చిపోయి కర్ణాటకలోని తమిళనాడు వాహనాలను తగులబెట్టడం ప్రారంభించారు. ప్రతీకార చర్య కర్ణాటక ఆగడాలను వివిధ మాధ్యమాల ద్వారా రాష్ట్రానికి చేరడంతో తమిళ ప్రజలు రెచ్చిపోయారు. కర్ణాటకకు చెందిన వాహనాలు, ఇతర వ్యాపార సంస్థలపై దాడులను ప్రారంభించారు. చెన్నై రాయపేటలోని కర్ణాటకవాసులకు చెందిన న్యూ ఉడ్‌ల్యాండ్ హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున పెట్రో బాంబులు విసిరి విధ్వంసానికి పాల్పడ్డారు. తెల్లవారుజాము 3.30 గంటలకు 12 మందితో కూడిన దుండగుల బృందం ఇనుపరాడ్లను చేతబూని మోటార్‌సైకిళ్లపై చేరుకుంది. లోనికి ప్రవేశించిన వారు హోటల్‌పై మూడు పెట్రోబాంబులను విసరడంతో స్వల్పంగా మంటలు చెలరేగాయి. హోటల్ ముందుభాగంలో కొత్త ఏర్పాటు చేసిన ఐస్‌క్రీం పార్లర్‌లోకి జొరబడి అద్దాలు ధ్వంసం చేశారు. ఈలోగా విధుల్లో ఉన్న సెక్యూరిటీ అక్కడికి చేరుకోగా అతన్ని రాడ్‌తో కొట్టి గాయపరిచి, పారిపోయారు. కర్ణాటకలోని తమిళులపై దాడులు చేస్తే ఇక్కడి కన్నడిగులపై దాడికి పాల్పడుతామని నినాదాలు చేస్తూ అదే అంశంతో కూడిన కరపత్రాలను జారవిడిచి పారిపోయారు. హోటల్లోని సీసీ కెమెరాల ద్వారా వారంతా తందై పెరియార్ ద్రావిడ కళగానికి చెందిన వారిగా గుర్తించి నలుగురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి చిదంబరానికి చేరుకున్న కర్ణాటక లారీని ఏడుగురు దుండగులు అనుసరించి పాక్షికంగా ధ్వంసం చేశారు. తాను తమిళనాడుకు చెందినవాడినని డ్రైవర్ శక్తి మొరపెట్టుకోవడంతో లారీని తగులబెట్టకుండా విడిచిపెట్టారు. శీర్కాళి వైదీశ్వరన్ కోవిల్ వద్ద నిలిచి ఉన్న కర్ణాటకకు చెందిన జీపు అద్దాలను పగులగొట్టారు. కర్ణాటకకు నుంచి రామేశ్వరానికి వచ్చిన రెండు వ్యాన్లపై దాడికి పాల్పడినందుకు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వేలూరు సమీపం రాణీ పేట నుంచి బెంగళూరుకు వెళుత్ను లారీని ధ్వంసం చేయగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. బెంగళూరు-వేలూరు కర్ణాటక బస్సును అంబూరు వద్ద అడ్డగించిన వీసీకేకు చెందిన 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రామేశ్వరంలో సోమవారం తెల్లవారుజామున కర్ణాటకకు చెందిన రెండు టెంపోవ్యాన్లను ధ్వంసం చేశారు. ఈ కేసులో దేశీయ మున్నని పార్టీకి చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. తమిళనాడువాసులపై దాడులు కొనసాగిన పక్షంలో కర్ణాటక ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తామని తమిళనాడు పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం హెచ్చరించింది. పుదుచ్చేరిలోని కర్ణాటక బ్యాంకును వివిధ సంఘాలకు చెందిన వారు సోమవారం ముట్టడించారు. తమిళనాడుకు చెందిన సంపత్ (21) బెంగళూరులో బీఎస్సీ పాలిటెక్నిక్ చదువుతున్నాడు. ఫేస్బుక్లో కావేరి వివాదంపై తన స్పందన తెలియజేశారు. దీంతో బెంగళూరులో అతనిని చుట్టుముట్టిన ఆందోళనకారులు రాళ్లతో కొట్టి గాయపరిచారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పుదుచ్చేరివాసులు ఇక్కడి కర్ణాటక బ్యాంకును ముట్టడించి సీఎం సిద్ధరామయ్య దిష్టిబొమ్మను దహనం చేశారు. కర్ణాటక ఆందోళనకారులను దుయ్యబడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 35 మందిని పుదుచ్చేరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఎండీఎంకే అధినేత వైగో, సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు శరత్‌కుమార్ ఖండించారు. సీఎం అత్యవసర సమావేశం కర్ణాటక, తమిళనాడు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న దృష్ట్యా ముఖ్యమంత్రి జయలలిత సోమవారం డీజీపీ టీకే రాజేంద్రన్, చెన్నై నగర కమిషనర్ జార్జ్‌తో అత్యవసరంగా సమావేశమయ్యారు. తమిళనాడులోని కర్ణాటక కార్యాలయాలు, వాహనాలు ఇతర సంస్థలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు సమాచారం. సూపర్‌స్టార్ రజనీకాంత్, నటుడు ప్రభుదేవా ఇళ్లకు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఎమ్మెల్యే సోదరుని ఇంటిపై బాంబు దాడి
కేకే.నగర్: తిరుపూర్ జిల్లా తారాపురం చిన్నియప్ప నగర్ ప్రాంతానికి చెందిన దైవశిఖామణి గాంగేయం ఎమ్మెల్యే తని అరసుకు సోదరుడు. అతడు తమిళనాడు కొంగు యువజన సమాఖ్య ప్రాంతీయ కమిటీ సభ్యుడు. సోమవారం ఉదయం దైవశిఖామణి ఇంటికి కొందరు నిఘా వేయడం చూసి దైవశిఖామణి తారాపురం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన దైవశిఖామణి తన కుటుంబ సభ్యులతో పాటు మిద్దెపై నిలబడి మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో బైక్‌లో వచ్చిన ముగ్గురు పెట్రోల్ బాంబులను దైవశిఖామణి ఇంటి పైకి విసిరారు. ఇంకనూ దైవశిఖామని మోపెడ్‌పై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. విచారణ చేపట్టారు. తని అరసు ఎమ్మెల్యేకు, దైవశిఖామణికి పాతకక్షలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం దైవశిఖామణి చెన్నైకు వెళ్లి కారులో తారాపురం వస్తుండగా తని అరసు అనుచరులు దాడికి ఫ్రయత్నించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ దాడులకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి
ఏథెన్స్: ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతున్న గ్రీస్‌లో ఓ మంత్రి నివాసంపై దుండగులు పెట్రోల్ బాంబులతో దాడి చేశారు. గత రెండు నెలల్లో మంత్రి నివాసంపై దాడులు జరుగడం ఇది రెండోసారి. సెంట్రల్ ఏథెన్స్లోని హోంమంత్రి అలెకోస్ ఫ్లాంబౌరరీస్ నివాసంపై శనివారం జరిగిన పెట్రోల్ బాంబు దాడిలో ఎవరూ గాయపడలేదు. ముసుగులతో వచ్చిన వ్యక్తులు ఆయన నివాసం ప్రవేశద్వారం వద్ద పెట్రోల్ బాంబులు విసిరారు. ఈ సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నారు. ఈ ఘటనలో ఇంటి బయట ఉన్న రెండు కార్లు ధ్వంసమయ్యాయి. ఇంటి కిటికిల అద్దాలు కూడా పగిలిపోయాయి. గ్రీస్‌లో ఇటీవల స్వదేశీ ఉగ్రవాదంతో సమమతమవుతోంది. దేశీ తీవ్రవాదులు ఇటీవలకాలంలో సంప్రదాయ, సామ్యవాద పార్టీలను లక్ష్యంగా చేసుకోగా.. తొలిసారి రాడికల్ వామపక్ష పార్టీ అయిన సిరిజా నేతలపైనా దాడులు జరుపుతున్నారు. గతంలోనూ మంత్రి ఫ్లాంబౌరరీస్ లక్ష్యంగా బాంబు దాడులు చేశారు. -
మంత్రి కార్యాలయంపై పెట్రో బాంబుతో దాడి
చెన్నై: తమిళనాడులోని మదురై నగర వాసులను పెట్రో బాంబులు వణికిస్తున్నాయి. గుర్తుతెలియని దుండగులు పలు ప్రాంతాల్లో ప్రముఖుల ఇళ్లపై పెట్రో బాంబులతో దాడులు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు మంత్రి సెల్లూరు కే రాజు కార్యాలయంపై పెట్రో బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. ఇటీవలి కాలంలో పెట్రో బాంబులతో దాడి చేయడమిది ఆరోసారి. వరుసగా దాడులు జరుగుతుండటం పోలీసులకు సవాల్‌గా మారగా, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మదురైలోని ప్రఖ్యాత మీనాక్షి దేవాలయం సమీపంలో పెట్రోలు బాంబులు వేయడం కలకలం సృష్టించింది. అగంతకులు రెండు గంటల వ్యవధిలో మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. పేలుడు శబ్దం వినపడడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. -
ప్రముఖ దేవాలయంలో బాంబుల కలకలం
చెన్నై: తమిళనాడు మధురైలోని మీనాక్షి ఆలయ సమీపంలో బాంబుపేలుడు ఉద్రిక్తతను రాజేసింది. మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండుగులు బాంబులు విసరడంతో కలకలం మొదలైంది. రెండు గంటల వ్యవధిలో మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. మధుర మీనాక్షి ఆలయంలో పెద్ద ఎత్తున పేలుడు శబ్దం వినపడడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వీటిలో ఒకటి మాత్రమే పేలడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పెద్దఎత్తున పగిలిన బీరుసీసాలను స్వాధీనం చేసుకున్నామని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు. జాతీయ భద్రతాదళాలు (ఎన్ఎస్జీ) ఆలయంలోని భద్రతా ఏర్పాట్లు సమీక్షించిని కొన్ని గంటల తరువాత ఈ సంఘటన చోటు చేసుకుంది. డీఎస్పీ విశ్వనాథన్ తన బృందంతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. సీసీ టీవీ, రక్షణ వ్యవస్థ, స్కానింగ్ పరికరాలను క్షుణ్ణంగా పరీక్షించారు. పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఉగ్రవాద చర్య అయి ఉంటుందనే అనుమానాలను ప్రాథమిక విచారణ అనంతరం వారు తోసిపుచ్చారు. భద్రతా వ్యవస్థలో కొన్నిమార్పులు సూచించిన ఆయన.. ఆలయ సిబ్బంది, భక్తులు మొబైల్ వాడకాన్ని పరిమితం చేయాలని కోరారు. ఆలయం లోపల జామర్ ఏర్పాటు చేయాలన్నారు. -
రథోత్సవంలో రాజకీయం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఇరువర్గాల మధ్య రాజకీయ కక్షలు గ్రామంలో నిప్పురాజేశాయి. పెట్రోబాంబుల దాడులతో అమ్మవారి రథంతోపాటు ప్రజల ఆస్తులు బుగ్గిపాలయ్యాయి. ఈ విధ్వంసకాండలో జిల్లా ఎస్పీ సహా పలువురు పోలీసులకు గాయాలు కాగా 120 మందిని అరెస్ట్ చేసి గ్రామంలో 144 సెక్షన్ విధించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విల్లుపురం జిల్లా శంకరాపురం సమీపంలో శేషముత్తిరం అనే గ్రామం ఉంది. గ్రామంలో కొలువుదీరి ఉన్న మారియమ్మన్ ఆలయంలో ప్రతిఏటా ఉత్సవాలు చేస్తారు. ఇందుకోసం 2012లో అమ్మవారికి కొత్తగా రథం చేయించారు. అదే ఏడాది ఉత్సవాల్లో రథోత్సవం చేయాలని నిర్ణయించారు. అయితే గ్రామ రోడ్లలో రథోత్సవం చేయరాదని పేర్కొంటూ ఒక వర్గం అభ్యంతరం లేవనెత్తింది. గ్రామ పెద్దల సమక్షంలో చర్చలు జరిపినా ససేమిరా అనడంతో రథోత్సవంపై నిషేధం విధించారు. మూడేళ్లుగా ఆడిమాస తిరువిళారోజున ఇరువర్గాల మధ్య చర్చ జరగడం, నిషేధంతో రథోత్సవం జరుపకపోవడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ ఏడాది ఎలాగైనా రథోత్సవం జరపాలని ఒక వర్గం నిర్ణయించుకుంది. నిషేధం విధించినా ఆదివారం ఉదయం రథోత్సవం జరిపితీరాలని ఏర్పాట్లు చేసుకుంది. బాంబుల బీభత్సం: తమ మాటను కాద ని రథోత్సవానికి సిద్ధం అయ్యారని ఆగ్రహం చెందిన ఆలయ ప్రత్యర్థి వర్గం సుమారు 500 మందితో శనివారం రాత్రి ట్రాక్టర్లతో గ్రామానికి చేరుకుంది. కొత్తగా తయారుచేసిన రథంపై తమ వెంట తెచ్చుకున్న పెట్రోబాం బులను విసరగా పూర్తిగా దగ్దం అయింది. అలాగే ఆ పరిసరాల్లోని ఇళ్లపై బాంబులు విసరడంతో అగ్నికి ఆహుతైనాయి. ఈ మంటలు పరిసరాలకు వ్యాపించడంతో వరికుప్పల్లు పరశురామ ప్రీతి అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకోగా ఆందోళనకారులు వారిపై రాళ్లురువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువును ప్రయోగించి చెదరగొట్టారు. పరిస్థితి అదుపుతప్పడంతో విల్లుపురం జిల్లా ఎస్సీ నరేంద్రనాథ్ గ్రామంలోకి రావడంతో ఆయనపై కూడా రాళ్లురువ్వారు. ఈ దాడుల్లో ఎస్సీ సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ సంఘటన నేపథ్యంలో మహిళలు సహా సుమారు 120 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసి 144వ సెక్షన్ విధించారు. గత గ్రామ పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచిన వ్యక్తి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మారియమ్మన్ ఆలయానికి కొత్త రథం తయారుచేయించాడు. ఇదే ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తి గ్రామంలో రధ సంచారంపై ఉన్న నిషేధాన్ని అడ్డుపెట్టుకుని విధ్వంసానికి దారితీసినట్లు సమాచారం. -
చెన్నైలోని పోస్టాఫీస్‌లపై పెట్రో బాంబు దాడులు
నగరంలోని మైలాపూర్, మందవల్లి పోస్టాఫీస్‌లపై గత అర్థరాత్రి పెట్రో బాంబులతో దాడిలు చేసిన ఆగంతకులను 24 గంటల్లో పట్టుకుంటామని చెన్నై పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఆ దాడులకు పాల్పడిని ఆగంతకుల వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని తెలిపారు. ఆ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలుస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టాఫీస్‌లపై పెట్రో బాంబులు వేసిన నేపథ్యంలో అయా ప్రాంతాల్లో భారీగా శబ్దాలు వెలువడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఆ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటి సంఘటనల స్థలానికి చేరుకున్నారు. అతకాయిల పనా లేకుంటే ఎవరైన కావాలని చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.