చెన్నై: తమిళనాడులోని మదురై నగర వాసులను పెట్రో బాంబులు వణికిస్తున్నాయి. గుర్తుతెలియని దుండగులు పలు ప్రాంతాల్లో ప్రముఖుల ఇళ్లపై పెట్రో బాంబులతో దాడులు చేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున తమిళనాడు మంత్రి సెల్లూరు కే రాజు కార్యాలయంపై పెట్రో బాంబులు విసిరారు. ఈ దాడిలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదు. ఇటీవలి కాలంలో పెట్రో బాంబులతో దాడి చేయడమిది ఆరోసారి.
వరుసగా దాడులు జరుగుతుండటం పోలీసులకు సవాల్గా మారగా, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల మదురైలోని ప్రఖ్యాత మీనాక్షి దేవాలయం సమీపంలో పెట్రోలు బాంబులు వేయడం కలకలం సృష్టించింది. అగంతకులు రెండు గంటల వ్యవధిలో మూడు పెట్రోల్ బాంబులు విసిరారు. పేలుడు శబ్దం వినపడడంతో భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు.
మంత్రి కార్యాలయంపై పెట్రో బాంబుతో దాడి
Published Sun, Jan 10 2016 8:49 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 PM
Advertisement