చెన్నైలోని పోస్టాఫీస్లపై పెట్రో బాంబు దాడులు | Petrol bombs attack on chennai post office | Sakshi
Sakshi News home page

చెన్నైలోని పోస్టాఫీస్లపై పెట్రో బాంబు దాడులు

Published Tue, Oct 29 2013 8:35 AM | Last Updated on Mon, Aug 20 2018 9:35 PM

Petrol bombs attack on chennai post office

నగరంలోని మైలాపూర్, మందవల్లి పోస్టాఫీస్లపై గత అర్థరాత్రి పెట్రో బాంబులతో దాడిలు చేసిన ఆగంతకులను 24 గంటల్లో పట్టుకుంటామని చెన్నై పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఆ దాడులకు పాల్పడిని ఆగంతకుల వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని తెలిపారు. ఆ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలుస్తున్నట్లు పేర్కొన్నారు.

 

పోస్టాఫీస్లపై పెట్రో బాంబులు వేసిన నేపథ్యంలో అయా ప్రాంతాల్లో భారీగా శబ్దాలు వెలువడ్డాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు చెందారు. ఆ క్రమంలో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటి సంఘటనల స్థలానికి చేరుకున్నారు. అతకాయిల పనా లేకుంటే ఎవరైన కావాలని చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement