పాటల లెక్క కుదిరింది
Published Mon, Nov 11 2013 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM
సంగీత దర్శకుడు చిన్నిచరణ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అదీ లెక్క’. మనోజ్ నందం, మహి, కృష్ణుడు, ప్రియాంక, నిక్కి, అన్విక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మోహన్ జీఎంసీ, ఎన్.అంజన్‌బాబు, రమ్య ప్రవీణ్ నిర్మాతలు. చిన్నిచరణే స్వరాలందించిన ఈ చిత్రం పాటలను మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆయనతో పాటు అతిథులుగా పాల్గొన్న జయసుధ, టీఆర్‌ఎస్ నాయకుడు జితేందర్‌రెడ్డి, సునీల్‌కుమార్‌రెడ్డి, ఎన్.శంకర్, శేఖర్‌రెడ్డి, రమేష్ పుప్పాల, సురేష్ కొండేటి, రాహుల్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమా విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని, దర్శకునిగా తన తొలి ప్రయతం సఫలం అవుతుందనే నమ్మకం ఉందని చిన్నిచరణ్ చెప్పారు.
Advertisement
Advertisement