Jitendra Reddy
-
ప్రతినెల ఒకటో తేదీన ఇంటికి వచ్చి పింఛన్ అందిస్తున్నారు: లబ్దిదారులు
-
ఢిల్లీ: మాజీ ఎంపీ నివాసంలో కిడ్నాప్ కలకలం
-
మాజీ ఎంపీ నివాసంలో కిడ్నాప్ కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని మహబూబ్‌నగర్ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి నివాసంలో జరిగిన కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో సౌత్ అవెన్యూలోని ఆయన నివాసం ముందు జితేందర్ రెడ్డి డ్రైవర్ థాపా, మహబూబ్‌నగర్‌కు చెందిన మున్నూరు రవితో పాటు మరో ఇద్దరిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని పీఏ రాజు మంగళవారం మధ్యాహ్నం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చదవండి: రాజ్‌భవన్‌కు కాషాయం రంగు సోమవారం రాత్రి రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వీరిని అపహరించారని ఫిర్యాదులో ఆరోపించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంలో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిపై మున్నూరు రవి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. -
కేంద్రంపై దుష్ప్రచారం తగదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డిలు కావాలనే కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. వీరు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. 2017–18 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రాష్ట్రానికి రూ.21,631 కోట్లు కేటాయించిందని, ఇందులో డిసెంబర్ నాటికి రూ.19,601 కోట్లు విడుదల చేసిందని స్పష్టం చేసింది. వీటికి అదనంగా కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా మరో రూ.9వేల కోట్లు విడుదల చేసిందని తెలిపింది. బుధవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్‌రెడ్డి పార్టీ మీడియాసెల్ కన్వీనర్ సుధాకరశర్మతో కలసి విలేకరులతో మాట్లాడుతూ... గత నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రూ.3,56,375 కోట్లు కాగా అందులో కేంద్రం నుంచి పొందిన నిధులే రూ 1,58,000 కోట్లని పేర్కొన్నారు. -
రిపబ్లిక్ వేడుకలకు తెలంగాణ శకటం
న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకలకు తెలంగాణ శకట ప్రదర్శనకు రక్షణ శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు రక్షణ శాఖ... రాష్ట్రప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శకటం తొలిసారిగా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొననుంది. ఏటా రిపబ్లిక్ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేకతలను శకటాల రూపంలో ప్రదర్శించడం ఆనవాయితీ. బతుకమ్మ, తెలంగాణ బోనం, గోల్కొండ కోట ప్రతిబింబించేలా తెలంగాణ శకటం ఉండనుంది. ఈ తరహాలోనే ఈ సంవత్సరం తెలంగాణ తరఫున సమాచారశాఖ నుంచి ఓ అధికారి, ఓ ఆర్టిస్టు ఢిల్లీలో జరిగిన రెండు సమావేశాల్లో పాల్గొని డిజైన్‌పై వివరాలు ఇచ్చారు. దానికి రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి...కృతజ్ఞతలు తెలిపారు. -
పాటల లెక్క కుదిరింది
సంగీత దర్శకుడు చిన్నిచరణ్ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అదీ లెక్క’. మనోజ్ నందం, మహి, కృష్ణుడు, ప్రియాంక, నిక్కి, అన్విక ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మోహన్ జీఎంసీ, ఎన్.అంజన్‌బాబు, రమ్య ప్రవీణ్ నిర్మాతలు. చిన్నిచరణే స్వరాలందించిన ఈ చిత్రం పాటలను మంత్రి ఉత్తమకుమార్‌రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆయనతో పాటు అతిథులుగా పాల్గొన్న జయసుధ, టీఆర్ఎస్ నాయకుడు జితేందర్‌రెడ్డి, సునీల్‌కుమార్‌రెడ్డి, ఎన్.శంకర్, శేఖర్‌రెడ్డి, రమేష్ పుప్పాల, సురేష్ కొండేటి, రాహుల్ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ సినిమా విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలని, దర్శకునిగా తన తొలి ప్రయతం సఫలం అవుతుందనే నమ్మకం ఉందని చిన్నిచరణ్ చెప్పారు.