న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకలకు తెలంగాణ శకట ప్రదర్శనకు రక్షణ శాఖ అనుమతి లభించింది. ఈ మేరకు రక్షణ శాఖ... రాష్ట్రప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శకటం తొలిసారిగా రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొననుంది. ఏటా రిపబ్లిక్ దినోత్సవాల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేకతలను శకటాల రూపంలో ప్రదర్శించడం ఆనవాయితీ.
బతుకమ్మ, తెలంగాణ బోనం, గోల్కొండ కోట ప్రతిబింబించేలా తెలంగాణ శకటం ఉండనుంది. ఈ తరహాలోనే ఈ సంవత్సరం తెలంగాణ తరఫున సమాచారశాఖ నుంచి ఓ అధికారి, ఓ ఆర్టిస్టు ఢిల్లీలో జరిగిన రెండు సమావేశాల్లో పాల్గొని డిజైన్‌పై వివరాలు ఇచ్చారు. దానికి రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ జితేందర్ రెడ్డి...కృతజ్ఞతలు తెలిపారు.