
వీవీ వినాయక్
‘ఆది, దిల్, ఠాగూర్, అదుర్స్, నాయక్, ఖైదీ నంబర్ 150’ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు వీవీ వినాయక్ ఇక నటుడిగా లొకేషన్‌లోకి అడుగుపెట్టనున్నారు. అవును.. వీవీ వినాయక్ లీడ్ రోల్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ‘దిల్’ రాజు నిర్మిస్తారు. నరసింహ రావు దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమం త్వరలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే రెగ్యులర్ షూటింగ్‌ను ఆగస్టు రెండోవారంలో టీమ్ ప్లాన్ చేసిందని సమాచారం. సెట్లో నటీనటులతో ఎలా చేయాలో చెప్పి, చేయించుకున్న వినాయక్‌కి నటన పెద్ద కష్టం కాదని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
Comments
Please login to add a commentAdd a comment