హ్యాట్రిక్‌ హిట్‌తో 2020కి స్వాగతం చెబుతాం | Producer Dil Raju at Iddari Lokam Okate movie | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్‌ హిట్‌తో 2020కి స్వాగతం చెబుతాం

Published Fri, Dec 6 2019 1:03 AM | Last Updated on Fri, Dec 6 2019 1:03 AM

Producer Dil Raju at Iddari Lokam Okate movie - Sakshi

జీఆర్‌ కృష్ణ, దిల్‌ రాజు, రాజ్‌ తరుణ్, బెక్కం వేణుగోపాల్‌

‘‘2019లో ‘ఎఫ్‌2, మహర్షి’ వంటి బ్లాక్‌బస్టర్స్‌ సాధించాం. ఈ ఏడాది నాలుగైదు సినిమాలు ఉంటాయనుకున్నాం కానీ మూడు సినిమాలతోనే ముగిస్తున్నాం. మా మూడో చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’ని  ఈ నెల 25న విడుదల చేస్తున్నాం’’ అన్నారు ‘దిల్‌’ రాజు. రాజ్‌ తరుణ్, షాలినీ పాండే జంటగా జీఆర్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌  నిర్మించారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ టర్కీ సినిమా చూసిన కృష్ణ ఈ ఐడియాను నాకు చెప్పాడు. మన నేటివిటీకి తగిన విధంగా కథను డెవలప్‌ చేశాం. ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ. ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య జరిగే ప్రేమకథ. సినిమాల్లో ఒకప్పటితో పోలిస్తే చాలా మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం లిప్‌కిస్‌ల ట్రెండ్‌ నడుస్తోంది.

మా సినిమాలో కూడా లిప్‌కిస్‌ ఉండటంతో సెన్సార్‌ వారు ‘యు/ఎ’ సర్టిఫికెట్‌ ఇచ్చారు. మేం అనుకున్నట్లు జరిగితే హ్యాట్రిక్‌ హిట్‌తో ఈ ఏడాదిని ముగిస్తాం. 2020 మాకు మంచి వెల్‌కమ్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘పుట్టిన దగ్గరి నుంచి ఒకటయ్యేవరకు హీరో, హీరోయిన్‌ మధ్య సాగే ప్రేమకథ ఇది. మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌తో ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్‌ చేసి బయటకు వస్తారు ప్రేక్షకులు. ఈ సినిమాలో వైవిధ్యమైన రాజ్‌తరుణ్‌ కనపడతారు’’ అన్నారు జీఆర్‌ కృష్ణ. ‘‘నాకు కలిసొచ్చిన డేట్‌.. ‘ఉయ్యాల జంపాల’ విడుదలైన డిసెంబర్‌ 25న ఈ సినిమా విడుదలవుతోంది’’ అన్నారు రాజ్‌ తరుణ్‌. ‘‘పెద్ద సాంకేతిక నిపుణులు సపోర్ట్‌ చేయడంతో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్‌.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement