‘సీనయ్య’గా వినాయక్‌.. | VV Vinayak Look In Seenayya Movie Revealed | Sakshi
Sakshi News home page

‘సీనయ్య’గా వినాయక్‌..

Published Tue, Oct 8 2019 6:27 PM | Last Updated on Tue, Oct 8 2019 6:28 PM

VV Vinayak Look In Seenayya Movie Revealed - Sakshi

ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నరసింహారావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘సీనయ్య’ పేరును ఖరారు చేశారు. మంగళవారం రోజున ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. అందులో వినాయక్‌ మెకానిక్‌ షెడ్‌లో నుంచి నడిచివస్తున్నట్టు చూపించారు.

దిల్‌ రాజ్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర కథ 1980 బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. ఈ సినిమాలో పాత్ర కోసం వినాయక్‌ బరువు తగ్గారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ వినాయక్‌ పుట్టినరోజున(అక్టోబర్‌ 9) ప్రారంభం కానుంది. దర్శకుడిగా పలువురు తెలుగు హీరోలతో సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన వినాయక్‌.. ఈ చిత్రంలో హీరోగా ఎలా మెప్పిస్తారో చూడాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement