కెరీర్‌కు వెలుగునిచ్చే కోర్సులు... | Telangana Telangana State Agricultural University Professor Shankar | Sakshi
Sakshi News home page

కెరీర్‌కు వెలుగునిచ్చే కోర్సులు...

Published Wed, Jun 17 2015 11:36 PM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

కెరీర్‌కు వెలుగునిచ్చే కోర్సులు...

కెరీర్‌కు వెలుగునిచ్చే కోర్సులు...

తెలంగాణలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేటీఎస్‌ఏయూ), శ్రీ పి.వి. నరసింహారావు తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ ఫర్ వెటర్నరీ, యానిమల్ అండ్ ఫిషరీ సెన్సైస్,శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది. దీనిపై స్పెషల్ ఫోకస్...
 
 తెలంగాణ ఎంసెట్-2015 (బైపీసీ స్ట్రీమ్)
 ఆధారంగా ప్రవేశం కల్పించే కోర్సులు
 
 బీఎస్సీ(అగ్రికల్చర్)
 కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్; అగ్రికల్చరల్ కాలేజ్, అశ్వారావుపేట, ఖమ్మం; అగ్రికల్చరల్ కాలేజ్, జగిత్యాల, కరీంనగర్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 252. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.
 
 బీటెక్(ఫుడ్ టెక్నాలజీ)
 కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు; కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ, పులివెందుల, కడపల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 16. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.
 
 బీఎస్సీ (కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్): కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 15ూ. కోర్సు కాల వ్యవధి
 
 బీవీఎస్సీ అండ్ ఏహెచ్
 కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్‌‌స, రాజేంద్రనగర్, హైదరాబాద్; కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్‌‌స, కోరుట్ల, కరీంనగర్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది.సీట్ల సంఖ్య 108. కోర్సు కాల వ్యవధి ఐదేళ్లు.
 
 బీఎఫ్‌ఎస్సీ
 కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్‌‌స, నెల్లూరులో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 10ూ. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.
 బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్; కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్, కొత్తకోట, మహబూబ్‌నగర్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 100. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.
 
 అర్హత: ఫిజికల్ సెన్సైస్; బయలాజికల్ సెన్సైస్ లేదా నేచురల్ సెన్సైస్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.(ూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని 371(ఛీ) ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన 36 శాతం సీట్లు.) అగ్రికల్చర్ కోర్సుల్లో థియరీతోపాటు
 ప్రాక్టికల్ శిక్షణ!
 
 దేశంలో ఫుడ్ టెక్నాలజీ, సీడ్ టెక్నాలజీ తదితర వ్యవసాయాధారిత రంగాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. రానున్న పదేళ్లలో ఈ రంగంలో గణనీయ అభివృద్ధి చోటుచేసుకోనుంది. ఈ నేపథ్యంతో వ్యవసాయ రంగంలో మానవ వనరుల కొరత తీవ్రంగా ఉంది. కాబట్టి అగ్రికల్చర్ బీఎస్సీ కోర్సులనభ్యసించిన వారికి విస్తృత అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు. ఈ కోర్సుల్లో థియరీతో పాటు క్షేత్ర స్థాయి నైపుణ్యాల్లోనూ విద్యార్థులకు శిక్షణ లభిస్తోంది. కోర్సులో చివరి సంవత్సరం కరిక్యులంలో భాగంగా విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి, అక్కడి రైతులతో కలిసి పనిచేసి, ప్రాక్టికల్ అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఈ సమయంలో విద్యార్థులను ఏదైనా ఒక పరిశ్రమకు కూడా అనుసంధానిస్తా రు. మన రాష్ట్రంలో కేవలం ప్రభుత్వ సంస్థల్లోనే అగ్రిక ల్చర్ కోర్సులు అందుబాటులో ఉండడం వల్ల విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య లభిస్తుంది. ఈ కోర్సులు పూర్తి చేసిన వారికి బ్యాంకింగ్, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలతోపాటు ఉన్నత విద్యావకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
 - డాక్టర్ పీవీ రావు,
 ప్రొఫెసర్ అండ్ హెడ్(రిటైర్డ్),
 అగ్రికల్చర్ కాలేజీ, పీజేటీఎస్‌ఏయూ- హైదరాబాద్.
 
 ఇంటర్మీడియెట్ అర్హతతో కోర్సులు
 బీఎస్సీ(ఆనర్స్) హోమ్‌సైన్స్ (బాలికలకు మాత్రమే): కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్‌‌స, సైఫాబాద్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 47.అర్హత: ఇంటర్లో ఎంపీసీ/బైపీసీ/ఎంబైపీసీ ఉత్తీర్ణత. హోంసైన్స్ మూడేళ్ల డిప్లొమా కోర్సు లో ఉత్తీర్ణులు పది శాతం సూపర్ న్యూమరరీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ(ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ: కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్‌‌స, సైఫాబాద్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 14. అర్హత: ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత. ఇంటర్మీడియెట్ ఒకేషనల్ లేదా పాలిటెక్నిక్‌లో హోంసైన్స్ సంబంధిత కోర్సులు చేసిన వారు కూడా అర్హులే. మొత్తం 14 సీట్లలో 7 సీట్లను ఇంటర్ ఒకేషనల్ కమర్షియల్ గార్మెంట్ డిజైనింగ్ అండ్ మేకింగ్(సీజీడీఎం) కోర్సు చేసిన వారికి కేటాయించారు.
 
 బీఎస్సీ(ఆనర్స్) ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్:
 కాలేజ్ ఆఫ్ హోమ్ సైన్‌‌స, సైఫాబాద్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. సీట్ల సంఖ్య 14.
 అర్హత: ఇంటర్మీడియెట్ (10+2)లో బైపీసీ/ ఎంబైపీసీ ఉత్తీర్ణత. లేదా హోంసైన్స్ సంబంధిత సబ్జెక్టులు/ న్యూట్రిషన్/ బయో కెమిస్ట్రీ/హ్యూమన్ ఫిజియాలజీతో ఇంటర్ ఒకేషనల్ కోర్సులో ఉత్తీర్ణత. పాలిటెక్నిక్ (హోంసైన్స్) కోర్సు పూర్తి చేసిన వారు కూడా అర్హులు.
  తెలంగాణ ఎంసెట్-2015(ఎంపీసీ స్ట్రీమ్)
 ఆధారంగా ప్రవేశం కల్పించే కోర్సులు
 
 బీటెక్(అగ్రికల్చర్ ఇంజనీరింగ్):
 కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, సంగారెడ్డి, మెదక్; కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బాపట్ల, గుంటూరు; కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, మడకశిర అనంతపురం ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం సీట్ల సంఖ్య 90. వీటిలో 32 సీట్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, 58 సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భర్తీ చేస్తుంది.
 
 బీటెక్(ఫుడ్ టెక్నాలజీ):
 లేజ్ ఆఫ్ ఫుడ్‌సైన్‌‌స అండ్ టెక్నాలజీ, బాపట్ల, గుంటూరు; కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్‌‌స అండ్ టెక్నాలజీ, పులివెందుల, కడపల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం సీట్ల సంఖ్య 27. వీటిలో 10 సీట్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, 17 సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భర్తీ చేస్తుంది.

 బీఎస్సీ(కమర్షియల్ అగ్రికల్చరల్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్):
 కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. మొత్తం సీట్ల సంఖ్య 12. వీటిలో 4 సీట్లను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, 8 సీట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి భర్తీ చేస్తుంది.ప్రవేశం: ఎంపీసీ స్ట్రీమ్‌లో ప్రవేశానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించే ఎంసెట్ కౌన్సెలింగ్‌లో పాల్గొనాలి.  దరఖాస్తు విధానం: ఎంసెట్(బైపీసీ స్ట్రీమ్), ఇంటర్మీడియెట్ ఆధారంగా జరిగే ప్రవేశాలకు వేర్వేరు దరఖాస్తులు వెబ్‌సైట్‌లో లభిస్తాయి. పూర్తి చేసిన దరఖాస్తులను కంప్ట్రోలర్, పీజేటీఎస్‌ఏయూ పేరుతో హైదరాబాద్‌లో చెల్లుబాటయ్యేలా తీసిన డీడీతో సహా కింది చిరునామాకు పంపాలి.
 
 రిజిస్ట్రార్, పీజేటీఎస్‌ఏయూ,
 రాజేంద్రనగర్, హైదరాబాద్-30
 దరఖాస్తులకు చివరి తేది: 2015 జూన్ 25
 వెబ్‌సైట్: www.pjtsau.ac.in/
 
 కెరీర్ అవకాశాలు
 
 బీఎస్సీ-అగ్రికల్చర్
 ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ విభాగాలు; వ్యవసాయం ఆధారంగా పనిచేస్తున్న ఆర్థిక సంస్థలు; బ్యాంకులు, సూక్ష్మ రుణ సంస్థలు; ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల సంస్థలు; అగ్రీ బయోటెక్ సంస్థలు; వ్యవసాయ విద్యను అందిస్తున్న సంస్థలు, పరిశోధన సంస్థలు తదితరాల్లో అవకాశాలు లభిస్తాయి. ప్రారంభంలో రూ. 20 వేల వరకు వేతనం లభిస్తుంది.
 
 బీఎస్సీ (సీఏ అండ్ బీఎం)
 బ్యాంకుల్లో ఫీల్డ్ ఆఫీసర్‌గా, రూరల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా అవకాశాలుంటాయి. పురుగుల మందులు, విత్తనాలు, ఎరువుల కంపెనీల్లో ఉద్యోగాలుంటాయి. వ్యవసాయ సంబంధ కంపెనీలకు మార్కెటింగ్ స్పెషలిస్టులుగా పనిచేయొచ్చు. ప్రారంభంలో రూ.20 వేల వరకు వేతనం లభిస్తుంది.
 
 బీటెక్-ఫుడ్ టెక్నాలజీ
 హోటల్ పరిశ్రమలో వీరికి డిమాండ్ అధికంగా ఉంది. ఆహార పదార్థాల తయారీ, ఆహార నాణ్యత విభాగాల్లో అవకాశాలు పుష్కలం. ఆహార శుద్ధి, నిల్వ, ప్యాకేజింగ్ పరిశ్రమల్లోనూ ఉద్యోగాలుంటాయి. పరిశోధన సంస్థల్లోనూ, విద్యా సంస్థల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ప్రారంభంలో రూ.15 వేల వరకూ వేతనం లభిస్తుంది.
 
 బీఎస్సీ ఆనర్స్ (హోంసైన్స్)
 ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైనింగ్ సంస్థలు; అపెరల్ పరిశ్రమ; స్వచ్ఛంద సంస్థలు; డే కేర్ సెంటర్లు; ప్రీస్కూ ల్స్; ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు; డైట్ కౌన్సెలింగ్ కేంద్రా లు, విద్యా సంస్థలు;పరిశోధన సంస్థల్లో అవకాశాలుంటా యి. ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు లభిస్తాయి. డిగ్రీ అర్హతగా ప్రభుత్వం నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరుకావొచ్చు. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ.20 వేలు వరకు లభిస్తుంది.
 
 బీఎస్సీ (ఆనర్స్) ఫ్యాషన్ టెక్నాలజీ
 వస్త్ర, తోలు ఉత్పత్తులు, ఆభరణాల తయారీ పరిశ్రమల్లో మర్కండైజింగ్ ఎగ్జిక్యూటివ్‌లుగా, ఫ్యాషన్ డిజైనర్లుగా, ఇలస్ట్రేటర్లుగా ఉద్యోగాలు పొందొచ్చు. ఎగుమతి సంస్థ లు, వస్త్ర మిల్లులు, బోటిక్‌ల్లోనూ అవకాశాలున్నాయి. ఫ్యాషన్ షోల నిర్వాహకులు కూడా కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి మంచి అవకాశాలిస్తున్నారు. ప్రారంభంలో రూ. 15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది. సృజనాత్మకతతో ఫ్యాషన్ రంగంలో త్వరగా ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు.
 
 బీఎస్సీ (ఆనర్స్) ఫుడ్‌సైన్స్ అండ్ న్యూట్రిషన్
 ఆసుపత్రుల్లో డైటీషియన్లు, డైట్ కన్సల్టెంట్లుగా ఉద్యోగ అవకాశాలుంటాయి. వసతి గృహాలు, హోటళ్లు, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల్లోనూ ఉద్యోగులుగా స్థిరపడొచ్చు. పాఠశాలలు, కళాశాలలు కూడా డైటీషియన్లను నియమించుకుంటున్నాయి. ప్రారంభంలో రూ.10 వేల నుంచి రూ. 20 వరకు వేతనం ఉంటుంది.
 
 బీఎఫ్‌ఎస్సీ
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని సంబంధిత విభాగాల్లో అవకాశాలను దక్కించుకోవచ్చు. ప్రైవేట్ రంగంలో సీ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్ యూనిట్స్, ఆక్వా ఫీడ్ ప్లాంట్స్, ఫిషింగ్ గీయర్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు, పరిశోధన సంస్థల్లో వివిధ హోదాలను అందుకోవచ్చు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా స్థిరపడొచ్చు.
 
 బీవీఎస్సీ అండ్ ఏహెచ్
 పశు సంవర్థక శాఖలో, వెటర్నరీ హాస్పిటల్స్, జూ పార్క్స్‌లో డాక్టర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు సంబంధించి ఫీడ్ మెషీన్ ప్లాంట్లు, పౌల్ట్రీ పరిశ్రమ, ఫుడ్ మాన్యుఫాక్చరింగ్ పరిశ్రమలలో ఉద్యోగాలు లభిస్తారుు. సొంత క్లినిక్‌ల ఏర్పాటు ద్వారా కూడా ఆదా యం పొందొచ్చు. ప్రభుత్వ సర్వీసులో క్లాస్-1 ఆఫీసర్ హోదాలో వెటర్నరీ సర్జన్‌గా నెలకు రూ.45వేల వేతనం లభిస్తుంది. ప్రైవేట్ రంగంలో నెలకు రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు వేతనంగా అందుకోవచ్చు.
 
 బీఎస్సీ హార్టికల్చర్ (ఆనర్స్)
 వ్యవసాయ క్షేత్రాల్లో సూపర్‌వైజర్లు, ఫార్మ్ మేనేజర్లు, ఎస్టేట్ మేనేజర్లుగా కెరీర్ ప్రారంభించవచ్చు. ప్రారంభంలో నెలకు కనీసం రూ.10 వేల వేతనం వస్తుంది. ప్రభుత్వ రంగంలో హార్టికల్చర్ శాఖలో అసిస్టెంట్లు, ఆఫీసర్ తదితర హోదాలు పొందొచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్లాలనుకుంటే సొంతంగా నర్సరీలు, ఫార్మ్ సెంటర్లను నెలకొల్పవచ్చు.
 
 బీటెక్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
 అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల్లో బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీర్లకు అవకాశాలుం టాయి. వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ సంస్థ లు, పరిశోధన సంస్థలు, మైక్రో ఇరిగేషన్ సంస్థలు, డైరీ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల్లో ఉద్యోగాలుంటాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement