
కమర్షియల్ దర్శకుడిగా ఒకప్పుడు వరుస విజయాలు సాధించన వీవీ వినాయక్ ఇటీవల కాలంలో ఆస్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు. అయితే దర్శకుడిగా నిరాశపరుస్తున్న ఈ సీనియర్ డైరెక్టర్ త్వరలో కొత్త అవతారంలో దర్శనమివ్వబోతున్నాడు. వినాయక్ హీరోగా త్వరలో సినిమా ప్రారంభం కానుంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు వినాయక్ కసరత్తులు ప్రారంభించాడు. ఈ సినిమాతో శంకర్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన నరసింహారావు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా అక్టోబర్ 9న ప్రారంభించనున్నారు.
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈసినిమా కథ 1980ల కాలంగా జరుగుతుందని తెలుస్తోంది. వినాయక్ లుక్, బాడీ లాంగ్వేజ్, ఏజ్‌కు తగ్గ కథ కావటం దిల్ రాజు స్వయంగా మాట్లాడి వినాయక్ ను హీరోగా ఒప్పించారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment