రాధిక, శరత్‌కుమార్‌లను అరెస్ట్‌ చేయండి | Court Order That Arrest Radhika And Sarathkumar In Check Bounce Case | Sakshi
Sakshi News home page

రాధిక, శరత్‌కుమార్‌లను అరెస్ట్‌ చేయండి– కోర్టు ఉత్తర్వులు

Published Sun, Jun 30 2019 8:40 AM | Last Updated on Sun, Jun 30 2019 4:47 PM

Court Order That Arrest Radhika And Sarathkumar In Check Bounce Case - Sakshi

పెరంబూరు:  నటుడు శరత్‌కుమార్, ఆయన సతీమణి రాధికా శరత్‌కుమార్‌లను అరెస్ట్‌ చేయాల్నిందిగా న్యాయస్థానం పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే,  రెడియన్స్‌ మీడియా సంస్థకు నటుడు శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, మరో నిర్మాత లిస్టిన్‌ స్టీఫెన్‌ చెల్లించాల్సిన రూ.2 కోట్లు ఇవ్వకపోవడంతో వారిని అరెస్ట్‌ చేయాల్సిందిగా చెన్నై , సైదాపేట కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

నటుడు శరత్‌కుమార్, రాధికా శరత్‌కుమార్, లిస్టిన్‌ స్టీఫెన్‌ కలిసి ఇంతకు ముందు కొన్ని చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో వారు రేడియన్స్‌ మీడియా సంస్థ నుంచి తీసుకున్న రుణం రూ.2 కోట్లకుగానూ చెక్కును ఇచ్చారు. అయితే ఆ చెక్కు బౌన్స్‌ అయ్యింది. దీంతో ఆ రేడియన్స్‌ మీడియా సంస్థ తరఫున శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్‌ స్టీఫెన్‌లపై చెన్నై, సైదాపేట కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం కోర్టుకు హాజరు కావలసిన శరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్, లిస్టింగ్‌ స్టీఫెన్‌లు రాలేదు.దీంతో వారిని అరెస్ట్‌ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసుపై తదుపరి విచారణను జూలై 12వ తేదీకి వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement