
భాష ఏదైనా సరే థ్రిల్లర్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయా చిత్రాలని ఓటీటీలో రిలీజైన తర్వాత తెలుగు ప్రేక్షకులు చూసేస్తుంటారు. అలా రీసెంట్ గా మలయాళం నుంచి 'రేఖాచిత్రం' మూవీ స్ట్రీమింగ్ లోకి రాగా.. ఇప్పుడు తమిళ డబ్బింగ్ చిత్రం ఒకటి వచ్చేసింది.
(ఇదీ చదవండి: 'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ))
సీనియర్ నటుడు శరత్ కుమార్ 150వ సినిమాగా తీసిన 'ద స్మైల్ మ్యాన్' గతేడాది డిసెంబరులో థియేటర్లలో రిలీజైంది. పేరున్న నటీనటులు పెద్దగా లేకపోవడంతో సరిగా ఆడలేదు. తర్వాత ఓటీటీలోకి వచ్చింది గానీ తమిళ వెర్షన్ మాత్రమే తీసుకొచ్చారు. తాజాగా ఆహా ఓటీటీలో తెలుగు వెర్షన్ రిలీజ్ చేశారు.
'ద స్మైల్ మ్యాన్' విషయానికొస్తే.. శరత్ కుమార్ ఓ పోలీస్ ఆఫీసర్. అనుకోకుండా ప్రమాదానికి గురై అల్జీమర్స్ వ్యాధి బారిన పడతారు. జ్ఞాపకాలన్నీ ఏడాది గుర్తుంటాయని డాక్టర్స్ చెప్పడంతో తన పరిష్కరించిన కేసుల గురించి పుస్తకంగా రాస్తారు. ఇందులో స్మైల్ మ్యాన్ కేసు గురించి మాత్రం సగమే రాస్తారు? ఇంతకీ స్మైల్ మ్యాన్ ఎవడు? ఎందుకు హత్యలు చేస్తున్నాడనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు))