ముంబై : చెక్‌బౌన్స్ కేసులో బాలీవుడ్ నటి కొయినా మిత్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో కొయినా మిత్రాకు న్యాయస్ధానం ఆరునెలల జైలు శిక్ష విధించింది. తనపై నిరాధార అభియోగాలు మోపారని.. కోర్టు ఉత్తర్వులను తాను ఎగువ కోర్టులో సవాల్ చేస్తానని నటి పేర్కొన్నారు. 2013లో మోడల్ పూనం సేథి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నటిపై కేసు నమోదైంది. కొయినా మిత్రా తనకు రూ 22 లక్షలు బాకీపడ్డారని..అప్పును చెల్లించే క్రమంలో ఆమె తనకు ఇచ్చిన రూ 3 లక్షల చెక్ తగినన్ని నిధులు లేకపోవడంతో బౌన్స్ అయిందని సేథి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా సేథి తనకు రూ 22 లక్షలు అప్పు ఇచ్చే స్ధాయి ఆమెకు లేదని కొయినా చేసిన వాదనను ముంబైలోని అంథేరి మెట్రపాలిటన్ కోర్టు మేజిస్ర్టేట్ చవాన్ తోసిపుచ్చారు. తుది వాదనల సందర్భంగా తన న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో తమ వాదనను పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయని తాము ఈ ఉత్తర్వులను ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని కొయినా మిత్రా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment