విశాఖపట్నం: చెల్లని చెక్కు జారీ చేసిన మహిళకు ఏడా జైలు శిక్ష విధిస్తూ నగరంలోని నాల్గవ ప్రత్యేక మెజిస్ట్రేట్ గురువారం తీర్పు చెప్పారు. ఫిర్యాదు న్యాయవాది ఎడ్ల రాజారావు అందించిన వివరాలు ఎలా ఉన్నాయి. నిందితురాలు పశ్చిమగోదావరి జిల్లా ఏఎస్‌విఎస్ శ్యాంకృషియాన్ భార్య ఉషారాణి. ఆమె తన అవసరాల నిమిత్తం 2013లో ఆంధ్ర విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు ఆచార్య శ్యాంబాబు నుంచి రూ.8 లక్షలు అప్పుగా తీసుకున్నారు.
అప్పు తీర్చే నిమిత్తం ఒక ప్రాంసరీ నోటు ఇచ్చారు. ఈ నేపథ్యంలో శ్యాంబాబు తన బాకీ తీర్చాలని డిమాండ్ చేయడంతో ఉషారాణి 2017 ఆగస్టు ఏడో తేదీన ఒక చెక్కు జారీ చేశారు. పాక్షికంగా బాకీ తీర్చే నిమిత్తం రూ.8 లక్షలకు జారీ చేసిన చెక్కును ఫిర్యాది శ్యాంబాబు తన ఖాతాలో జమ చేశారు.
తగినన్ని నిధులు లేని కారణంగా ఆ చెక్కు నిరాదరణకు గురైంది. ఫిర్యాది తన వారి ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసిన ప్రయోజనం లేకపోయింది. దీంతో శ్యాంబాబు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణలో ఉండగా శ్యాంబాబు మృతి చెందారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment