ఆట పాటలతో బోధన అవసరం
విశాఖ విద్య: ప్రీ ప్రైమరీ స్థాయిలో చిన్నారులకు ఆటపాటలతో విద్యనందించేలా అంగన్‌వాడీ కార్యకర్తలు కృషి చేయాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ జోగ చంద్రశేఖర్ రావు అన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో 776 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు సమగ్ర శిక్ష ద్వారా మంగళవారం నుంచి ఆరురోజుల పాటు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని మండలాల్లో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేయగా, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో ఆయన పర్యటించి, శిక్షణ జరుగుతున్న తీరును పరిశీలించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment