ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
మహారాణిపేట: ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉంటూ, చాకచక్యంగా వ్యవహరించాలని పీవో, ఏపీవో, సెక్టోరల్ అధికారులనుద్దేశించి రిటర్నింగ్ అధికారి, విశాఖ జిల్లా కలెక్టర్ ఎం. ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి విడత శిక్షణ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నిసార్లు ఎన్నికల విధుల్లో పాల్గొన్నా.. నిర్లిప్తతకు తావులేకుండా, ఎన్నికల కమిషన్ ఆదేశాలు తుచ తప్పక పాటించాలన్నారు. సొంత నిర్ణయాలు పనికిరావని హెచ్చరించారు. ఏఆర్వో, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్, ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి సుధాసాగర్, పీవో, ఏపీవో, సెక్టోరల్ అధికారుల సందేహాలను నివృత్తి చేశారు. పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తరువాత చేయాల్సిన విధులను పీపీటీ ద్వారా వివరించారు. ఎన్నికల సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment