
సాక్షి, విశాఖ: టీడీపీ నేత కీచకపర్వం చూసి స్థానికులు, కుటుంబ సభ్యులు ముక్కున వేలేసుకుంటున్నారు. సదరు నేతకు వరుసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె గర్భం దాల్చడం తర్వాత రెండో వివాహం చేయడం.. బంధువులను సైతం షాక్‌కు గురిచేసింది. ఇక, బాధితురాలి ఫిర్యాదుతో తాజాగా కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి.. మంత్రి అచ్చెన్నాయుడికి అనుచరుడు కావడం గమనార్హం.
వివరాల ప్రకారం.. విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బలి రవి కుమార్ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. వరసకు కూతురైన వివాహితపై ఏళ్ల తరబడి లైంగిక దాడి చేసినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి చిన్నతనంలోనే తల్లితండ్రులు చనిపోవడంతో చేరదీసిన పిన్ని, బాబాయ్ రవి కుమార్.. ఆమెను చేరదీశారు. అనంతరం, శ్రీకాకుళానికి చెందిన వ్యక్తితో బాధిత మహిళకు వివాహం జరిపించారు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య వివాదాలు సృష్టించి ఇద్దరిని విడదీసిన రవికుమార్. ఇక, ఒంటరిగా ఉన్న బాధిత మహిళపై రవికుమార్.. వరుసగా లైంగిక దాడికి తెగబడ్డాడు.
లైంగిక దాడి విషయం బయటకు చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో, సదరు మహిళ గర్భం దాల్చడంతో కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. అనంతరం, బాధిత మహిళ కనపడటం లేదని బంధువులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అసలు విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్.. మళ్లీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చి రహస్యంగా ప్రసవం చేయించాడు. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రిని అని రవి కుమార్ సంతకం చేశాడు.
ఆ తరువాత దగ్గరుండి బాధితురాలికి రెండో వివాహం జరిపించాడు. ఈ సమయంలో బాధితురాలి నుంచి డబ్బు, నగలు.. ఆమెకు ఉన్న ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురి చేశాడు. దీంతో, చేసేదేమీ లేక బాధితురాలు.. పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో రవికుమార్ కీచకపర్వం మొత్తం వెలుగులోకి వచ్చింది. అయితే, తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి తప్పించుకు తిరుగుతున్నందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment